ఆరోగ్యవంతమైన జీవితానికి, ఆరోగ్యకరమైన నిద్ర ముఖ్యం.మన జీవితంలో నిద్ర చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఉంటుంది. నిద్ర వేళ మారినా, సరైన నిద్ర లేకపోయినా, నిద్రలేమి వంటివి ఎన్నో సమస్యలు ప్రతిరోజూ ఎంతోమంది ఎదుర్కొంటూ ఉంటారు. వాటిని అధిగమించడానికి బోలెడు చిట్కాలు, పద్ధతులు, మందులు ఒకటేమిటి కనిపించే ప్రతిదీ ఆచరించడానికి సిద్ధపడిపోతారు. ఫలితం లేకపోయేసరికి నీరసపడిపోతారు. అయితే చాలామంది విషయంలో ఒక ఇబ్బంది కరమైన సంఘటన జరుగుతూ ఉంటుంది. రాత్రి నిద్రపోయిన తరువాత ఏ నడిరాత్రో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. మంచి నిద్రను పాడు చేస్తుంది. అందుకే ఈ సమస్యను అధిగమించడానికి అద్భుతమైన కొన్ని చిట్కాలు మీకోసం.
◆ సాయంత్రం పూట కాఫీ, సిగరెట్ల ప్రభావం రాత్రి నిద్రమీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందుకే సాయంత్రం వేళ ఎక్కువగా కాఫీ తీసుకోకూడదు.
◆ నిద్ర పట్టడానికి తగిన వ్యవధి ఇవ్వకపోవడం. సమయ వేళలు పాటించకపోవడం పెద్ద కారణం.
◆ పగలంతా మత్తుగా ఉండి, రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదని చాలా మంది అంటుంటారు. ఇలాంటి సమస్య ఉన్నవారు సాయంత్రం వేళల్లో నడవడం, వ్యాయామాలు చేయడం వల్ల చెమట పట్టి శరీరం చల్లబడి రాత్రివేళ మంచి నిద్ర పడుతుంది.
◆ ఆల్కహాల్ తాగితే బ్రహ్మాండంగా నిద్రపడుతుందని చాలా మనది అపోహ పడుతుంటారు. అయితే ఆల్కహాల్ మత్తు ఇస్తుంది కానీ ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. దీనివల్ల నిద్రాభంగం జరుగుగూనే ఉంటుంది.
◆ పగలు కునికిపాట్లు పడేవారికి ముఖ్యంగా సాయంత్రం వేళ ఇలా జరిగేవారికి రాత్రి సమయంలో నిద్ర సరిగా పట్టదు.
◆ రాత్రిపూట కలత నిద్ర పట్టినందువల్ల మూత్రానికి వెళ్లాలనే కోరిక పుడుతుంది. ఇదే అలవాటు అవడం వల్ల, మెలకువ వచ్చిన ప్రతిసారి మూత్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏ ఇతర జబ్బు లేని వారికి కలత నిద్ర వల్ల ఈ మూత్రవ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. నిగ్రహించుకోవడం ద్వారా ఈ సమస్యను అదుపు చేయవచ్చు.
◆ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన స్థితిలో ఉన్న నడుం నొప్పి, కీళ్ల నొప్పి, తదితర రోగులు పగటి సమయాల్లో పడుకుని ఉండటం వలన పగలు నిద్రపోయి రాత్రిపూట మేలుకొని నిద్రపట్టక చాలా అవస్త పడుతుంటారు. వీరు పగటి సమయాల్లో చదవడం, చిన్న చిన్న పనులు, నిద్ర వచ్చే సందర్భంలోఎదైన పనిని నిర్దేశించుకోవడం వంటివి చేస్తుంటే నిద్రను దూరంగా ఉంచచ్చు.
◆ యోగ, ప్రాణాయామం, ధ్యాన మార్గాలు పైన చెప్పుకున్న సమస్యలకు సరైన చికిత్సా సూత్రాలు, ఆధునిక వైద్యశాస్త్రం కంపేరింగ్ రిలాక్సేషన్ ట్రైనింగ్ అనే టెక్నీక్ ద్వారా, నిద్రాభంగానికి చికిత్స చేయాలనే అభిప్రాయాలు వ్యక్తం చేశాయి.
చివరగా……
మంచి నిద్ర మధ్యలో మెలకువ రావడానికి పైన చెప్పుకున్న కారణాలు అర్థం చేసుకుని అవి మీకూ ఉన్నాయేమో పరిశీలించుకుని పిదప వాటి పరిష్కారానికి తగిన సూచనలను పాటించడం వల్ల ఫలితం