Ayurvedic home remedies to control your blood sugar levels

ఎంత భరించలేని షుగర్ ఉన్నా సరే ఇలా చేస్తే షుగర్ టెస్ట్ చేయించుకుంటే షుగర్ నార్మల్ గా వస్తుంది జీవితంలో మళ్లీ రాదు

ఈ మధ్యకాలంలో చిన్న వయసులో ఉన్న వారినుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిలోనూ డయాబెటిస్ సమస్య సాధారణంగా కనిపిస్తుంది. మనం తినే మసాలా, జంక్ఫుడ్స్తో నిండిన ఆహారం, నిద్ర సరిగ్గా లేని  జీవిత విధానం, వ్యాయామం లేని పని గంటలు, విపరీతమైన ఒత్తిడి, ఆందోళనలు, శరీరంలో హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్తో పాటు వంశపారంపర్యంగా కూడా డయాబెటిస్ వస్తుంది. ఇందులో టైప్ 2 డయాబెటిస్ మన జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా అదుపులో పెట్టుకోవచ్చు. పోషకాలతో కూడిన ఆహారం, వ్యాయామంతో కూడిన దినచర్య, మందులు సమయానికి వాడటంతోపాటు ఆయుర్వేదం ప్రకారం కొన్ని చిట్కాలు డయాబెటిస్ను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.

 ఆయుర్వేదం మనకు ప్రకృతిలో లభించే పదార్థాలను ఉపయోగించి వ్యాధులను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దీని కోసం మనం జిల్లేడుఆకులను తీసుకోవాలి. తెల్ల జిల్లేడు ఆకులను ఒక రెండు, మూడు సేకరించి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. జిల్లేడు ఆకులు చెట్టు నుండి తెంపినపుడు పాలు విడుదలవుతాయి. ఈ పాలు కంట్లో పడితే కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఆకులను సేకరించాలి. పాలు పోయేంతవరకు పక్కన పెట్టి  తర్వాత శుభ్రంగా కడిగి వాడుకోవాలి. రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడిగి జిల్లేడు ఆకులతో రుద్దుతూ మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన కాళ్ళలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

 తిమ్మిర్లు, మంట వంటి సమస్యలు దూరమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఇలా రుద్దిన జిల్లేడు ఆకులను చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పెద్ద ఆకుపై పెట్టి ఈ ఆకును పాదాలకు పెట్టి దారంతో కట్టు కట్టాలి. పాదం మొత్తం ఇలా ఆకుతో కప్పివేయాలి. దీనిమీద సాక్స్ వేసుకవడం వలన మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం సాక్స్ తీసేసి కట్టు తీయాలి. ఇలా కనీసం ఎనిమిది రోజులపాటు ఈ చిట్కా పాటించాలి.  మొదలు పెట్టిన రోజు షుగర్ టెస్ట్ చేయించుకుని మళ్లీ ఎనిమిది రోజుల తర్వాత షుగర్ టెస్ట్ చేయించుకోండి. ఇలా చేయించుకోవడం వలన మీ శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గడం మీరే చూస్తారు.

1 thought on “ఎంత భరించలేని షుగర్ ఉన్నా సరే ఇలా చేస్తే షుగర్ టెస్ట్ చేయించుకుంటే షుగర్ నార్మల్ గా వస్తుంది జీవితంలో మళ్లీ రాదు”

Leave a Comment

error: Content is protected !!