శాకాహారులకు విటమిన్ బీ12 లోపం 95- 97% కనిపిస్తుంది. మన పేగులలో విటమిన్ బి12 అనేది అందరికీ తయారవ్వాలి. కానీ మనం ఈ రోజుల్లో తినే ఎసీడీక్ ఫుడ్ వల్ల గాని, కెమికల్ ఫుడ్స్ వలన, ఎరువులు పురుగు మందులు వేసిన ఆహారాలు వలన ఈ విధంగా ప్రాసెస్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ తినడం వలన మన పేగులలో బి12 ఉత్పత్తి తగ్గిపోతుంది. కాబట్టి అంత శాతం జనాలలో లోపం వస్తుంది. మాంసాహారం తినేవారికి డైరెక్ట్ గా మాంసంలో బి12 లభిస్తుంది. కనుక వీరికి ఈ లోపం ఉండదు. కానీ చాలామందిలో ఈరోజుల్లో బీ12 కనిపిస్తుంది.
ఈ లోపం గురించి తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. విటమిన్ బి12 లోపిస్తే ఎన్ని నష్టాలు ఉంటాయో ఈ రోజు మనం తెలుసుకుందాం. మొదటిగా నరాలపై ఉండే పోరా మైలీన్ షీట్ దెబ్బతింటుంది. మనకు నరాల ద్వారా మెదడుకు సందేశాలు అందుతాయి. ఈ పోర దెబ్బ తినడం వలన సందేశాలలో పొరపాట్లు జరుగుతాయి. ఇది చాలా పెద్ద నష్టం. ఇది ఎక్కువగా జరుగుతుంది. రెండవదిగా విటమిన్ బి12 లోపం వచ్చినప్పుడు కండరాల బలహీనత ఎక్కువగా ఉంటుంది. దీనివలన నీరసంగా ఉంటారు. మూడవదిగా మగతగా, నిద్ర ఎక్కువగా వస్తున్నట్లుగా ఉంటుంది.
నాలుగవదిగా అల్జీమర్స్ అనగా మతిమరుపు ఎక్కువగా వస్తుంది. ఐదవదిగా తీసుకుంటే రక్తహీనత. ఎనీమియా ఎక్కువగా కనిపిస్తుంది. ఆరవ నష్టం తీసుకుంటే మానసికంగా ఎక్కువగా డిస్టబెన్స్ ఉంటాయి. అంటే మానసిక ఒత్తిడి, అలజడ, ఇన్ బ్యాలెన్స్ గా ఉండడం. ఏడవ నష్టం మెటబాలిక్ డిసార్డర్స్ ఎక్కువగా వస్తాయి. ఎనిమిదవదిగా తీసుకుంటే జుట్టు ఊడటం ఎక్కువ అవుతుంది. తొమ్మిదవదిగా అజీర్ణం ఎక్కువగా అవుతుంది. మలబద్ధకం కూడా వస్తుంది. పదవదిగా కండరాల నొప్పులు ఎక్కువ అవుతాయి.
ఇటువంటి నష్టాలు అన్ని విటమిన్ బి12 లోపం వలన కలుగుతాయి. ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే వీటిని సూచనలు కింద గుర్తుపట్టడం చాలా కష్టం. కాబట్టి ఈ రోజుల్లో వెజిటేరియన్స్ అందరూ విటమిన్ బి12 టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. ఒకవేళ ఈ లోపం ఉంది అంటే దీనికి సంబంధించిన మెడికేషన్ తీసుకోవడం తప్పనిసరి. ఈ లోపం సరిదిద్దుకోవడానికి కొన్ని ఆహారాలు ఉంటాయి కానీ మెడికేషన్ ద్వారా అయితే త్వరగా విడుదల పొందవచ్చు. కనుక ఈ లోపం ఉంటే డాక్టర్ ను సంప్రదించి మెడికేషన్ తీసుకోవాలి…