Barleria prionitis mullu gorinta uses

జుట్టు పల్చగా ఉన్నవారు ఆలస్యం చేయకండి. జుట్టు విపరీతంగా పెరుగుతుంది.

మన ఇంటి చుట్టుపక్కల, కొండ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే మొక్క ముళ్ళ గోరింట. దీనిని గొబ్బి చెట్టు, తేనె పూలు, వజ్ర దంతి, ముళ్ళ కనకాంబరం వంటి పేర్లతో పిలుస్తారు. ఈ చెట్టు నిండా ముళ్ళతో పసుపు రంగు పూలు కలిగి ఉంటుంది. ఈ పువ్వులను దేవుని పూజలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ పువ్వులను సమర్పించడం వల్ల బంగారు పువ్వులను సమర్పించిన పుణ్యం లభిస్తుందని మన పెద్దవాళ్ళు చెప్పేవారు. ఈ మొక్కకు సాంప్రదాయంలోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్క ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులను మెత్తగా పేస్ట్ చేసి దానినుండి రసం వడకట్టి ఒక కప్పు పుల్లటి పెరుగులో ఈ రసాన్ని కలిపి తలకు అప్లై చేస్తే జుట్టు సమస్యలు తగ్గి జుట్టు రాలడం సమస్య కేవలం మూడు వారాల్లో తగ్గిపోతుంది.

 అలాగే జుట్టు పగిలి, గడ్డిలా ఉన్న జుట్టుకు ఈ ఆకుల రసాన్ని సమాన భాగంలో నువ్వుల నూనె కలిపి స్టౌ పై పెట్టి నీరంతా ఇగిరిపోయిన తరువాత నువ్వుల నూనెను తలకు అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్ళు బలపడి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ రెండు చిట్కాలలో ఏది పాటించినా మంచి ఫలితం ఉంటుంది. డెలివరీ తర్వాత బాలింతలలో బాలింత వాతం అని శరీరంలో నొప్పులు ఉంటాయి. ఇది నార్మల్ డెలివరీ అయిన స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు ముల్ల గోరింట వేరును తెచ్చి ఒక గ్లాస్ నీటిలో మరిగించి అరగ్లాసు అయ్యేంతవరకు ఉంచాలి. ఈ కషాయం తాగడం వలన బాలింత వాతం తగ్గుతుంది. స్త్రీలలో భవిష్యత్తులో తల నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటుంది. దురదలు, కురుపులు వంటి చర్మ సమస్యలు ఉన్నప్పుడు ఈ ఆకులను మెత్తగా పేస్ట్ చేసి చర్మానికి పట్టించి ఒక గంట తర్వాత కడిగేయడం వలన చర్మ సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి.

 ఎముకల మధ్య మంట నొప్పి వంటి సమస్యలకు ఈ మొక్కలను వేరుతో సహా సేకరించి బాగా నీడలో ఎండబెట్టి చెట్టును కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిదను ప్రతి రోజు అరస్పూన్ మొత్తంలో నీటిలో కలిపి  తాగడం వలన ఎముకల మధ్య ఉండే మంట నొప్పి తగ్గడంతో పాటు, ఆస్తమా సమస్య ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. మూత్రంలో మంట, నొప్పి, మూత్రం పచ్చగా వచ్చేవారు ఈ వేరును తెచ్చి ఎండబెట్టి దీనితో కషాయం చేసుకుని ప్రతి రోజూ తాగడం వలన మూత్రాశయ సమస్యలు తగ్గిపోతాయి. తల నొప్పి ఉన్నవారు ఈ ఆకులను కొంచెం వేడి చేసి నుదుటిపై పెట్టి కట్టు కట్టడం వలన తల నొప్పి సమస్య తగ్గిపోతుంది. ప్రకృతి మనకు అందించిన ఇంత మంచి ఔషధాలను ఉపయోగించుకొని చిన్న చిన్న సమస్యలకు మందులు వాడకుండా ఉపసమనం పొందవచ్చు.

Leave a Comment

error: Content is protected !!