Bath Powder at Home

వీటిని ఎండబెట్టి పొడి చేసి రోజు స్నానం చేసేటప్పుడు ఇలా వాడితే స్కిన్ మరియు ఫేస్ లో గ్లో పెరుగుతుంది….

ఒకప్పుడు మన పెద్దలు ఈ సున్నిపిండిని వాడేవారు. ఇప్పుడు ఈ సున్నిపిండిని మనం వాడటం మొదలు పెట్టవలసిన అవసరం చాలా ఉంది. ఆరోగ్యంతో పాటు అందంగా కనిపించాలి అంటే చాలామంది చంటి పిల్లలు దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు చర్మం గ్లో గా ఉండాలంటే మంచి స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలి అన్నా కాస్త దుమ్ము, ధూళి, కెమికల్ పొల్యూషన్ లాంటివి మట్టిలోకి వెళ్లి ఆడుకున్నప్పుడు వంటి మీద చేరతాయి. వాటిని పోగొట్టుకోవాలి అంటే హెల్దీ సున్నిపిండిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎర్ర కందిపప్పు మీ అందరికీ బాగా తెలుసు. ఈ ఎర్ర కందిపప్పు తీసుకుని బాగా ఎండలో ఆరబెట్టాలి. 

     కొన్ని బాదం పప్పులు కూడా తీసుకొని ఎండలో బాగా ఎండబెట్టేయాలి. ఈ రెండింటిని మిక్సీలో వేసి పౌడర్ చేయాలి. ఈ పౌడర్ ని ఎలా చేయాలి అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేయాలి. దీనిని జల్లిడిలో వేసి జల్లించుకోవాలి. ఇప్పుడు అడుగున మెత్తటి పొడి వస్తుంది. పైన వచ్చిన బరకగా ఉన్న దానిని మళ్లీ ఎండబెట్టి గ్రైండ్ చేసి మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా వచ్చిన పొడిని సున్నిపిండిగా మనం వాడుకోవచ్చు. చంటి పిల్లలకి మీగడ ఒళ్లంతా రాసి దానిని ఒళ్లంతా బాగా రుద్దిన తర్వాత ఈ సున్నిపిండిని నలుగు లాగా  పెట్టాలి. 

      ఈ విధంగా నలుగు పెడితే పిల్లల చర్మం మీద ఉన్న డెడ్ సెల్స్ రెండు లేయర్లు వరకు తొలగిపోతుంది. లోపల ఉన్న హెల్దీ లేయర్స్ బయటికి వస్తాయి.  స్కిన్ గ్లో బావుండడానికి, దుమ్ము, ధూళి పోవడానికి, స్కిన్ కండిషన్ బాగా ఉండడానికి ఈ సున్నిపిండి మంచిగా మీకు ఉపయోగపడుతుంది. అందుకని చంటి పిల్లల కొరకు ఇలాంటివి వాడటం  చాలా మంచిది. టీవీలో చూపించిన విధంగా ఇతర వాటికి మనం వెళ్లకుండా నేచురల్ గా ఇలా చేస్తే చిన్నపిల్లలు చాలా హెల్దీగా ఉంటారు. ఈ సున్నిపిండి శరీరానికి చక్కటి రంగు రావడానికి అద్భుతంగా పనిచేస్తుంది. 

      ఈ సున్నిపిండిని రోజు స్నానం చేసే ముందు వాడితే మంచి రంగు రావడమే  కాకుండా స్కిన్ త్వరగా ముడుతలు పడకుండా గ్లో గా ఉంటుంది. కానీ సున్నిపిండి అనేది ఎన్నో ఔషధ గుణాలు నింపుకున్న సౌందర్య సాధనంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నలుగు పిండిని ఉపయోగించి మనం చాలా లాభాలు పొందవచ్చు.

Leave a Comment

error: Content is protected !!