Bayleaves for weight Loss Health Benefits of Bayleaves

రోజుకు 3 సార్లు తాగండి. ఎటువంటి డైట్, ఎక్సర్సైజ్లు లేకుండా నెలలో 5కేజీల బరువు తగ్గుతారు

అధిక బరువు సమస్య అందరినీ చాలా వేధిస్తోంది. అలాంటి శరీరం అనేక రోగాలకు వేదికగా మారుతోంది. ఈ అధిక బరువు సమస్య వచ్చినప్పుడు తెలియకుండానే శరీరం పెరిగిపోతుంది. కానీ ఈ బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అనేక రకాల డైట్ లు, ఎక్సర్సైజులు చేసేవారు కూడా అధిక బరువు సమస్యలను అధిగమించలేక మధ్యలోనే నిరాశకు గురవుతుంటారు.

 అలాంటి వారు ఎక్సర్సైజులు, డైట్ తో పాటు శరీరాన్ని డిటాక్సిఫై చేసే డ్రింక్స్ ఉపయోగించాలి. ఇవి శరీరంలో అధికంగా పేరుకున్న మలినాలు, విష వ్యర్ధాలను బయటకు పంపి శరీరాన్ని ఆరోగ్యంగా మార్చుతాయి. అనారోగ్యాల నుంచి దూరంగా ఉంచడంతో పాటు శరీరంలో పేరుకున్న కొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి. దాని కోసం మనం తీసుకోవాల్సిన ఒక డ్రింక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 స్టవ్ వెలిగించుకొని దానిపై గిన్నెను పెట్టుకోవాలి. దానిలో రెండు గ్లాసుల నీటిని పోసి అందులో రెండు బిర్యానీ ఆకులను వేసుకోవాలి. ఈ డ్రింక్ ను మూడు పూటలకు సరిపడా చేసుకుంటున్నాం. బిర్యానీ ఆకును చిన్న ముక్కలుగా చేసుకుని ఈ నీటిలో వేసుకోవాలి. బిరియాని ఆకులో ఉండే అనేక గుణాలు మూత్రవిసర్జన కారిగా పని చేస్తుంటాయి. శరీరంలో పేరుకున్న అధిక నీటిని బయటకు పంపుతాయి. జీర్ణక్రియను మెరుగు పరిచి అధిక బరువు సమస్యను నిరోధించడంలో సహాయపడతాయి. 

వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గిపోతాయి. ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఈ సమయంలో పోషకాల శోషణను మరింత పెంచుతుంది. దీంట్లో అర చెక్క దాల్చిన చెక్కను కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క బరువు తగ్గించడానికి, దానిలోని కొవ్వు  తగ్గించే గుణాలు వల్ల సహాయపడుతుంది  ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వల్ల జీర్ణప్రక్రియ రేటు బాగా పెరుగుతుంది.

 తరువాత నీటిలో అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర బరువు తగ్గించడంతో పాటు ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని నివారించి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. తర్వాత 2 యాలకులను వలిచి నీటిలో వేయాలి. యాలకులు కూడా బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతాయి. ఇది జీర్ణక్రియను పెంచుతుంది అని నమ్ముతారు. కొవ్వును కరిగించేందుకు, ఆహారం బాగా జీర్ణమై శక్తిగా మారేందుకు యాలకులు బాగా సహాయపడుతాయి.

 తరువాత ఈ నీటిని బాగా మరిగించాలి. నీళ్లు రంగుమారిన వెంటనే ఆపేసి నీటిని వడకట్టుకోవాలి. ఈ నీటిలో అర చెక్క నిమ్మరసం, తేనే వేసుకుని తాగవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తేనె వాడకూడదు. ఈ డ్రింక్ ను ఉదయం టిఫిన్ చేసిన తరువాత, మధ్యాహ్నం భోజనం చేసిన అరగంట తరువాత, రాత్రి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేయడంతో శరీరంలో కొవ్వు శాతం తగ్గి అధిక బరువు సమస్యను అధిగమించవచ్చు.

Leave a Comment

error: Content is protected !!