beauty tips for all age women

వయసుకి తగ్గట్టే బ్యూటీ టిప్స్

అన్నీ వయసుల వారు ఒకే రకమైన ఫేస్ ప్యాక్స్ వాడకోడదు.. ఏ వయసులో ఉంటె.. దానికి తగిన విధానాన్ని అనుసరించాలి. ఒక్కో వయసులో వారు వారి వయసుకి తగిన విధంగా ప్యాక్స్ ని తయారు చేసుకొని వాడితే మంచి ఫలితాలు వస్తాయి..అలానే అందంగా, ఆకర్షణగా ఉంటారు.

Read This అందమైన గోళ్ళకోసం ఎం చేయాలి?

15 నుండి 20 సంవత్సరాలు అమ్మాయిల కోసం…

  • ఈ వయసులో ఉన్న అమ్మాయిలు కనీసం మూడు సార్లు వేడినీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
  • టోనర్ ని తప్పక వాడాలి. రైస్ వాటర్ మంచి టోనర్.. అలానే దోసకాయ గుజ్జు.
  • జ్యూస్లలో ద్రాక్ష పండు.. ఆపిల్ పండు, నారింజ పండు, నిమ్మరసం లాంటివి తరచూ తాగాలి. ఇవి కడుపుని క్లీన్ చేసి మొటిమలను మాయం చేస్తాయి.
  • కోడిగుడ్డు తెల్లసొనలో మూడు చుక్కలు నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఒక 20 నిమిషాల ఆగి వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే.. ముఖం కాంతివంతంగా.. మచ్చలు, మొటిమలు లేకుండా ఉంటుంది.

20 నుండి 40 సంవత్సరాల మహిళల కోసం…

  • ఈ వయసులో మొటిమలు, కళ్ళక్రింద నల్లని మచ్చలు, ముడతలు అధికంగా కనిపిస్తుంటాయి. ఒక మూడు చెంచాల టమాటో రసంలో తేనె కలిపి ముఖానికి రాయాలి. పది నిమిషాలు ఆరబెట్టాకా మసాజ్ చేసుకోవాలి.తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
  • కళ్ళక్రింద నల్లమచ్చలు తొలిగిపోవాలంటే.. ముందు సరైన నిద్ర అవసరం. మూడు లీటర్ల నీళ్ళు తాగాలి.. అలానే.. ఒక ఆలుగడ్డను రౌండ్ గా కోసి కళ్ళ పైన ఉంచుకోవాలి. ఇలా వారం రోజులు చేయాలి.

Leave a Comment

error: Content is protected !!