beauty tips with aloe vera

రాత్రి ఇది రాసి ఉదయాన్నే మీ ముఖం చూస్తే తేడా చూసి మీరే షాక్ అవుతారు

ప్రతి ఒక్కరికీ చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని  కోరిక ఉంటుంది. దాని కోసం ఎన్నో రకరకాల క్రీములను వాడుతూ ఉంటారు.  కెమికల్స్ ఉన్న క్రీములు వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తప్ప  ముఖం అందంగా  తయారవ్వదు. ఈ ఈజీ చిట్కాతో ఇంట్లోనే నేచురల్ గా ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని వాడటం వలన మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి.

ఒక వారం రోజులపాటు ఈ ఫేస్ ప్యాక్ వాడటం వలన మీ  ముఖంలో వచ్చే  తేడా చూసి మీరే షాక్ అవుతారు. దీని కోసం కావలసిన పదార్థాలు కలబంద మట్ట, పసుపు, నిమ్మకాయ, కొబ్బరి నూనె.  మీ ముఖానికి  సరిపడినంత కలబంద మట్ట కట్ చేసుకొని శుభ్రంగా కడిగి అంచులను కట్ చేసుకొని పై ఉన్న తొక్కను తీసి లోపల  ఉన్న జిగురు పదార్థాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనికోసం మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ వాడకూడదు. చెట్లు నుండి తీసిన  అలోవెరా జెల్ మాత్రమే వాడాలి.

దీనిలో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. నిమ్మకాయ చిన్న  కాయ అయితే ఒక కాయ పూర్తిగా వేసుకోవాలి. పెద్ద సైజు కాయ అయితే అర చెక్క నిమ్మరసం సరిపోతుంది. పావు టీ స్పూన్ కొబ్బరి నూనె కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక సారి మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసి ఒక ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి.  మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

అప్లై చేసిన తర్వాత  ఆరనిచ్చి రాత్రంతా అలా ఉంచేసి ఉదయాన్నే ముఖాన్ని చల్లని నీటితో కడిగి మెత్తటి టవల్తో మృదువుగా ఒత్తుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు ఒక వారం రోజుల పాటు చేయడం వలన మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.  ఈ చిట్కా వాడటం వలన ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. ముఖంపై ఉండే టాన్, నల్లని మచ్చలు పోయి ముఖం అందంగా, తెల్లగా తయారవుతుంది. మీ  ముఖం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ ఈజీ హోం మేడ్  ఫేస్ ప్యాక్ మీరు కూడా ట్రై చేసి నీ ముఖాన్ని కాంతివంతంగా తయారు చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!