belly fat burning exercises at home

ఏడు రోజుల్లో మీ శరీరంలో ఎక్కడ ఎక్కువగా కొవ్వు ఉన్నా కరిగి తీరాల్సిందే……. మీ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేరు

చాలామంది ప్రస్తుత కాలంలో అధిక బరువుతో బాధపడుతున్నారు. వీరికి శరీరంలో పొట్ట భాగంలో, తొడల భాగంలో, నడుం భాగంలో బాగా కొవ్వు పేరుకుపోయి నచ్చిన డ్రెస్ వేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఇటువంటివారు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ఉపయోగించడం ద్వారా ఏడు రోజుల్లో మీరు అనుకున్న దానికంటే అధిక బరువు నుంచి ఎక్కువ విడుదల ఉండవచ్చు. ఇది చాలా సింపుల్. అంతేకాకుండా ఇవన్నీ ఇంట్లో లభించే పదార్థాలు కావున ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

                ఇది స్త్రీ పురుషులు ఎవరైనా ఉపయోగించవచ్చు. ఈ రెమిడి తయారు చేసుకోవడానికి ముందుగా మనకు కావలసింది నాలుగు నిమ్మకాయలు. ఒక లీటర్ వాటర్ కు నాలుగు నిమ్మకాయలు సరిపోతాయి. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండడం వలన అధిక బరువు నుంచి విడుదల పొందడానికి నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ నిమ్మకాయలను చిన్న చిన్న ముక్కలుగా తొక్కతో సహా కట్ చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సింది రెండు అంగుళాల అల్లం ముక్క. ఈ అల్లం ముక్కను తొక్క తీసుకోవాలి.

                      అల్లం ముక్క అధిక బరువు నుంచి విడుదల పొందడానికి సహాయం చేస్తుంది. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నిమ్మకాయ ముక్కలు, అల్లం ముక్కలు, లీటర్ వాటర్ పోసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మెటబాలిజం రేట్లు పెంచుతుంది. అందువలన అధిక బరువు నుంచి విడుదల పొందవచ్చు. తర్వాత ఒక స్పూన్ సోంపు వేసుకోవాలి. సోంపు మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నీటిని బాగా మరగనివ్వాలి.

                     ఇలా మరుగుతుండగా ఒక చిన్న కట్ట కొత్తిమీరను శుభ్రం చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు బాగా మరిగించి. ఏదైనా ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇలా వచ్చిన కషాయాన్ని వారం రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ కషాయాన్ని రోజు పరగడుపున ఒక  టీ కప్పు తీసుకోవాలి. తాగేటప్పుడు వేడి చేసుకోవాలి. ఇలా ఏడు రోజులపాటు చేస్తే అధిక బరువు నుంచి విడుదల పొందవచ్చు. కావాలి అంటే ఒక స్పూన్ తేనెను కలుపుకోవచ్చు…

Leave a Comment

error: Content is protected !!