బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా ఎందుకు పనికిరావంటారు పెద్దలు. కానీ లేతబెండకాయలు మాత్రం చాలా పనులే చేస్తాయి. బెండకాయలు ఇష్టపడనివారు కూడా బెండకాయ యొక్క ప్రయోజనాలు తెలిస్తే ఇష్టంగా తింటారు. లేతబెండకాయలు తీసుకుని మొదలు చివర కట్ చేసి నిలువునా చీల్చి నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వలన అనేక పోషకాలు లభిస్తాయి.ఈ నీటిని తాగడంవలన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ నీటిలో ఫైబర్ అధికంగా ఉండడంవలన ఆహారం తేలిగ్గా జీర్ణమయి మలబద్దకం సమస్య తగ్గుతుంది. మలబద్దకం వల్ల ఉత్పన్నమయ్యే గ్యాస్, ఎసిడిటీ, ప్రేగులలో అంటుకున్న మలినాలను నిరోధిస్తుంది. ఈ నీరు రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. ప్రతి సీజన్లోనూ అందుబాటులో ఉండే బెండకాయల్లో విటమిన్ ఎ, బి, సి మరియు అనేక ప్రొటీన్లు ఉంటాయి. ఇవన్నీ బెండకాయ నీరు తాగడంవలన శరీరానికి అంది శరీరం పనితీరును మెరుగుపరుస్తాయి. హై బిపీని అదుపులో ఉంచుతాయి.మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
ఈ నీళ్ళు మధుమేహం ఉన్నవారికి షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులు తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఈ నీరు తాగడంవలన శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి శరీరం శుభ్రపడుతుంది. దానివలన చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు నిగారింపు సొంతం చేసుకుంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అధికబరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. శరీరం అధిక ఉష్ణోగ్రతకు లోనైనప్పుడు ఈ నీరు శరీరాన్ని చల్లబరుస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. కంటిచూపును పెంచడంలో సహాయపడుతుంది.
ఇందులో దొరికే విటమిన్ ఏ ఎముకలు బలంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఇందులో లెగ్జిన్ అనే ప్రొటిన్ రొమ్ము కాన్సర్ రాకుండా చేస్తుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి ,మెదడు చురుకుగా ఉండడానికి బెండకాయలు కూరగా లేదా నీటిగా అయినా ఇవ్వొచ్చు. బెండకాయలు కూరగా చేసిన తర్వాత కూడా కొన్ని రకాల పోషకాలు దొరుకుతాయి. అందరూ ఇష్టంగా తినే బెండకాయ ఫ్రై కంటే కూడా పులుసులు వలన అధిక పోషకాలు పొందవచ్చు. అందుకే ఇకపై బెండకాయలు ఆహారంలో భాగం చేసుకుందాం. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుదాం.