హలో ఫ్రెండ్స్ …చిన్నప్పుడు మా అమ్మ బెండకాయ తో రకరకాల పద్ధతులలో వండి పెట్టేది. బెండకాయ పుల్లగూర బెండకాయ ముద్ద కూర బెండకాయ పులుసు బెండకాయ పకోడీ కూర ఇలా చాలా రకాలు. బెండకాయలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మరియు విటమిన్ ఎ బి సి డి కె పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఎన్నో రకాల మినరల్స్ ఐరన్ మెగ్నీషియం క్యాల్షియం మాంగనీస్ వంటివి కూడా ఉంటాయి.
బెండకాయ పల్లీల కాంబినేషన్ తో మంచి రుచి కరంగా ఉండే వేపుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. . బెండకాయను అందరూ చాలా ఇష్టపడతారు రోజూ తీసుకునే బెండకాయ వేపుడు లాగా కాకుండా కొద్దిగా వెరైటీగా ఇలా చేసి చూడండి. ఇది అన్నంలో కలుపుకుని తినవచ్చు లేదా సైడ్ డిష్ గా తినొచ్చు లేదా రోటీలతో పుల్కాలతో చపాతీలతో అద్భుతంగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు
- అర కేజీ బెండకాయలు
- మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు
- మూడు టేబుల్ స్పూన్ల నూనె
- ఒక మీడియం సైజు ఉల్లిపాయ
- పోపు దినుసులు
- కరివేపాకు 2 రెమ్మలు
- ఎండు మిరపకాయలు 2
- పావు స్పూన్ పసుపు
- ఒక టీ స్పూన్ కారంపూడి
- అర స్పూన్ ధనియాల పొడి
- పన్నెండు వెల్లుల్లి రెబ్బలు
- రుచికి తగ్గట్టు ఉప్పు
తయారీ విధానం
- ముందుగా బెండకాయలను నీటితో శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక పొడి గుడ్డతో తుడిచి చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకోండి.
- స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయండి.
- నూనె వేడెక్కాక పల్లీలను వేసి మీడియం ప్లేన్లో కొద్దిగా వేయించండి . పల్లీలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే నూనెలో కట్ చేసి పెట్టుకొన్న బెండకాయలు కొద్ది కొద్దిగా వేసి వేయించండి ఒక ప్లేట్ లోకి పక్కన తీసి పెట్టుకోండి.
- పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు మినప్పప్పు టీస్పూను శనగపప్పు పావు స్పూన్ జీలకర్ర వేసి ట్రై చేయండి.
- ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేయండి.
- తరువాత రెండు రెమ్మలు కరివేపాకు, రెండు ఎండు మిరపకాయలు తుంచి వెయ్యండి. వీటినన్నింటిని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయండి.
- ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకొన్న పల్లీలు బెండకాయ ముక్కలను వేసి కలపండి.
- ఇందులో ఇప్పుడు పావు స్పూన్ పసుపు, ఒక టీస్పూన్ కారం పొడి, అరటీ స్పూన్ ధనియాల పొడి, పన్నెండు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి వేయండి. అన్నింటినీ బాగా కలిపి కొద్దిగా వేయించండి.
- చివరిగా రుచికి తగ్గట్టుగా ఉప్పు కలిపి బాగా మిక్స్ చేయండి.

మనం రోజూ తినే వేపుడి కంటే ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ గా చాల రుచిగా ఉంటుంది. ఇలా ఒక్కసారి చేసి మీ పిల్లలకు మీ ఇంట్లో వారికి పెట్టండి తిన్న తర్వాత మళ్లీ మళ్లీ ఇదే కావాలి అంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా మాకు తెలియ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.