Benefits and Uses of Aloe Vera

కలబంద మొక్కని ఇంట్లో అక్కడ పెడితే వద్దన్నా డబ్బే డబ్బు

అలోవెరా అదే కలబంద మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఈ మధ్య తప్పకుండా పెంచుకుంటున్నారు. దీనిని చర్మ, జుట్టు సంరక్షణ చర్యలలో భాగంగా ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తుంటారు. అయితే ఇది శరీర ఆరోగ్యానికే కాదు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచి నెగటివ్ ఎనర్జీ నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది అని పెద్దలు చెబుతున్నారు. చాలామంది దీన్ని ఇంట్లో ఇండోర్ ప్లాంట్ గా పెంచుకుంటారు. దీనికి కొద్దిపాటి నీరు ఉంటే చాలు ఎండ పెద్దగా లేకపోయినా చక్కగా పెరుగుతుంది. 

అలోవెరా మొక్క ఇంట్లో సానుకూలతకు గొప్ప మూలం.  ప్రతికూల శక్తి మరియు దురదృష్టం నుండి మిమ్మల్ని కాపాడటానికి మీ ఇంటిలోని ఏ మూలలోనైనా పెంచుకోవచ్చు.  కానీ ఇంట్లో పనులు సరిగ్గా జరగడం లేదు, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎప్పుడూ అనారోగ్యానికి గురవుతున్నప్పుడు అలోవెరా మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన చెడు శక్తి నుండి మన ఇంటిని కాపాడుకోవచ్చు. అయితే వీటి నుండి  పరిష్కారానికి అలోవెరా మొక్క ఎక్కడ పెట్టాలో తెలుసుకుందాం.

 ప్రతి నెలలో అమావాస్య రోజున ఒక మొక్కను వేళ్ళతో సహా తెచ్చుకొని శుభ్రంగా కడిగి దేవుడి పాదాల దగ్గర పెట్టుకోవాలి. దీనికి పసుపు, కుంకుమ, చందనంతో అలంకరించుకోవాలి. తర్వాత అగరబత్తి, సాంబ్రాణితో  ధూపం వెయ్యాలి. పసుపు, కుంకుమ కూడా నెగటివ్ ఎనర్జీని దూరంగా ఉంచడంలో చాలా బాగా పనిచేస్తాయి. అందుకే స్త్రీలకు బొట్టు పెట్టడం, కాళ్లకు పసుపు రాయడం చేస్తూ ఉంటారు. అలాగే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెడతారు. ఇలా అమావాస్య రోజంతా దేవుడి దగ్గర ఉంచిన అలోవెరా మొక్కని పాడ్యమి ఘడియలు మొదలైన తర్వాత ఇంటి గుమ్మానికి కుడివైపు ఒక దారం సహాయంతో కట్టాలి.

 ఇలా ప్రతి నెల అలోవేరా మొక్కను మార్చుకుంటూ ఉండాలి. ఇది ఎవరైనా చెడు దృష్టితో చూసినా లేదా మన ఇంటికి వచ్చిన వారు చెడు ఆలోచనలతో వచ్చినా ఇది గ్రహించి ఇంట్లో ఎటువంటి చెడు జరగకుండా అడ్డుకుంటుంది. అలాగే ఈ మొక్క ఎక్కువగా ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా ఇంటి గుమ్మం దగ్గర ఉండటం వలన కార్బన్డయాక్సైడ్ తగ్గించి మన శ్వాస మెరుగుపడుతుంది. 

Leave a Comment

error: Content is protected !!