benefits of aloe vera and coconut oil for hair

కొబ్బరినూనె లో ఇది ఒక్కటి కలపండి చాలు మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

మన చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితులు, కాలుష్యం, ఆహారం, నీరు వంటి అనేక కారణాలు జుట్టు రాలిపోవడానికి కారణమవుతుంటాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందుగా జుట్టు శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. దుమ్ము, ధూళి తలలో చేరితే చుండ్రు, తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం పరిపాటి. అందుకే తలలో దుమ్ము, ధూళి చేరకుండా ఎప్పటికప్పుడు తలస్నానం చేస్తూ ఉండాలి. అలాగే తలస్నానం చేసిన తరువాత తడి జుట్టు ఎక్కువగా రుద్దడం వల్ల జుట్టు రాలిపోతుంది. అలాగే తడి జుట్టు ముడి కూడా పెట్టకూడదు. బాగా ఆరిన తర్వాత మాత్రమే జడ వేసుకోవాలి.

 అలాగే జుట్టు సమస్యలు రాకుండా మనం కొంచెం పోషణ కూడా అందించాలి.  దానికోసం మనం అలోవేరాను తీసుకోవాలి. వీటిని కట్ చేసి దాని నుండి వచ్చే పసుపు ద్రావణాన్ని కడిగిన తరువాత పక్కన ఉండే ముళ్ళను తీసేసి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 100 గ్రాములు కొబ్బరి నూనె తీసుకొని స్టౌపై పెట్టుకోవాలి. కొబ్బరి నూనెలో అలోవెరా ముక్కలు వేసి నూనె ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించాలి. అందులో ఉండే పోషకాలు వేడికి పాడవుతాయి. గనుక రెండు నిమిషాల తర్వాత ఆపేయాలి.

 ఈ నూనె చల్లారిన తరువాత వడగట్టి నూనెను తలకు కుదుళ్ళ నుండి అప్లై చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు అప్లై చేసుకోవడం వలన జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టుకు కావలసిన పోషణ అందుతుంది. జుట్టు మృదువుగా ఉంటుంది. అలోవెరా జుట్టునే కాకుండా చర్మానికి, ఆరోగ్య రక్షణకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు కొద్దిగా అలోవేరా తినడం వలన రక్తం శుభ్రపడుతుంది.

 టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.బయోయాక్టివ్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి.యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ బాక్టీరియల్ ప్రభావాలు అలోవెరాలో సమృద్దిగా లభిస్తాయి. చర్మంపై ఉండే గాయాలను మాన్పుతుంది.దంత సమస్యలు దుర్వాసన దూరం చేస్తుంది. నోటి పుళ్ళు, పూత తగ్గుతాయి. మలబద్ధకం సమస్య నివారించబడుతుంది. అలాగే చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!