Benefits Of Aloe Vera Juice during summer

వేసవిలో మిమ్మల్ని చల్లగా ఉంచే కలబంద జ్యుస్, దానివల్ల ప్రయోజనాలు!!

కాలం గడిచేకొద్దీ ఆరోగ్య స్పృహ పెరగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన పద్ధతులు పాటిస్తున్నారు. అలాగే ఆయుర్వేదం, సహజంగా లభించే పోషకాలు, రోగనిరోధక పదార్థాల పట్ల ప్రజలు మక్కువ చూపుతున్నారు. అలాంటివి వాటిలో అగ్ర స్థానంలో ఉండేది కలబంద. ఇది జుట్టుకు, చర్మానికి, ముఖ్యంగా మహిళలు ముఖ సంరక్షణ కోసం, ముత్యమంటి అందం కోసం వాడుతుంటారు. అయితే కలబంధను కడుపుకు తీసుకోవడం వల్ల ఆశ్చర్య పరిచే పలితాలు మీ సొంతమవుతాయి. నమ్మకం లేకపోతే మీరే చదవండి మరి.

 మలబద్ధకాన్ని నిర్మూలిస్తుంది

 చాలామందిలో జబ్బులకు కారణమయ్యే మొదటి సమస్య మలబద్దకం. తిన్న ఆహారం సరిగా జీర్ణమయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. కానీ ఆహారంలో జరిగే మార్పులు, తీసుకున్న ఆహార స్వభావాన్ని బట్టి ఆహారం సరిగా జీర్ణమవదు. కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల  ఆంత్రాక్వినోన్స్ అని పిలువబడే సమ్మేళనాలు అందులో ఉన్నాయి మరియు ఇవి కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను మలవిసర్జనలో  బయటకు పంపేందుకు దోహాధం చేస్తాయి. 

విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. 

కలబంధలో విటమిన్ సి చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇది వ్యక్తి యొక్క  ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది సహజ యాంటీఆక్సిడెంట్ మరియు మంటతో పోరాడటానికి సహాయపడుతుంది.  విటమిన్ సి వివిధ రకాలైన నిర్దిష్ట ప్రయోజనాలను కలిగి ఉంది,  హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం నుండి రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం వరకు విటమిన్ సి ప్రముఖ పాత్ర పోషిస్తుంది.   అయితే ఈ విటమిన్ సి మనకు అందుబాటులో దొరికే పండ్లు, కూరగాయల నుండి సహజంగా లభిస్తుంది. అలాంటిది తీసుకోవడమే ఆరోగ్యం కూడా. వాటిలో  ముఖ్యంగా నారింజ, పచ్చి మిరియాలు, బ్రోకలీ, ద్రాక్షపండు మరియు టమోటా రసం వంటి ఆహారాలలో విటమిన్ సహజంగా ఉంటుంది, కానీ వీటన్నిటినీ మించి కలబంద రసంలో విగమిన్ సి శాతం  చాలా ఎక్కువగా ఉంటుంది. 

హైడ్రేటెడ్ గా ఉంచుతుంది

 రోజంతా పుష్కలంగా ద్రవాలు తాగడం మనిషి హైడ్రేటెడ్ గా ఉండటానికి సహాయపడుతుంది. అయితే తీసుకునే ద్రవ పదార్థాలు సహజంగా శరీరానికి శక్తిని సమకూర్చే కలబంద రసం చక్కెర పానీయాలు మరియు పండ్ల రసాల కంటే తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ప్రతీ రోజు కలబంద రసాన్ని ఉదయాన్నే  తాగడం వల్ల రోజు మొత్తం ఉల్లాసంగా ఉండవచ్చు. 

దంత సంరక్షణకు

చిగుళ్ల వాపును తగ్గించడంలో కలబంద అద్భుతంగా సహాయపడుతుంది. .కలబంద పళ్ల సున్నితత్వాన్ని మరియు నోటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. నోట్లో పుండ్లు, బలహీనమైన చిగుళ్లను బలంగా తయారుచేయడం వంటి వాటిలో దోహాధం చేస్తుంది.

కలబందలోని యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గొప్ప పలితాన్ని ఇవ్వడంలో దోహాధం చేస్తాయి.  

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

 టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కలబంద గొప్ప పలితాన్ని ఇస్తుంది.  కలబంద రసాన్ని క్రమం తప్పకజ్నడా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తద్వారా మధుమేహంతో బాధపడేవారు చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.  

 కడుపు అల్సర్ మరియు ఇతర సమస్యలు  

 కలబంద రసంలో అదనపు జీర్ణ ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి దీన్ని తీసుకునేవారిలో జీర్ణ వ్యవస్థ సమర్థవంతంగా ఉంటుంది. అలాగే జీర్ణాశయం, పేగులు, ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కడుపులో గాయాలు, అల్సర్లు, పూతలు వంటివి తగ్గించి, జీర్ణాశయం గోడలు దృడంగా ఉంచడానికి సహాయపడుతుంది.  కలబంద రసంలోని విటమిన్ సి వంటి అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఈ జీర్ణ ప్రభావాలకు దోహదం చేస్తాయి.

చివరగా…..

కలబంధ రసాన్ని సాధారణంగా పండ్ల రసాల్లా ప్రస్తుత కాలంలో ఎంతోమంది తీసుకుంటున్నారు.  ముఖ్యంగా వేసవిలో ఎంత ప్రయోజనకరమైనది కూడా.మరి ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టండి.

Leave a Comment

error: Content is protected !!