benefits-of-amla-for-boosting-hair-growth-thicker-hair

ఉసిరితో ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడమే కాకుండా జుట్టు రాలే సమస్య జీవితంలో ఉండదు

జుట్టు సమస్యలకు మనం తీసుకునే శ్రద్ధ ప్రారంభదశలోనే వాటిని తగ్గేలా చేస్తుంది నిర్లక్ష్యం చేసే కొద్దీ జుట్టు రాలిపోవడం, జుట్టు పలచబడటం, జుట్టు కళను కోల్పోయి గడ్డిలా తయారవడం వంటివి జరుగుతుంటాయి. అందుకే జుట్టు సమస్యలు తగ్గడానికి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ఆయిల్ ఉపయోగిస్తుంటే జుట్టు సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి కావలసిన పోషకాలను అందించి జుట్టు తెల్లబడకుండా అడ్డుకొని నల్లగా ఉండేదుకు ప్రయత్నించవచ్చు. 

దానికోసం ఈ చలికాలంలో ఎక్కువగా ఉసిరికాయలు దొరుకుతూ ఉంటాయి. వాటిని తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఉసిరి కాయలను చిన్న ముక్కలుగా తరిగి ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండిన ఉసిరి ముక్కలు సంవత్సరమంతా నిలవ ఉంటాయి. వీటిని ఉసిరి పప్పు అని అంటారు. ఆయుర్వేద షాపుల్లో కూడా అందుబాటులో ఉంటాయి. వీటిని ఒక రెండు స్పూన్లు తీసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ కలోంజి విత్తనాలు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ మెంతులు కూడా వేయాలి. ఇప్పుడు వీటన్నింటిని పలుచని క్లాత్ లో మూటలా కట్టుకోవాలి. తరువాత ఒక గాజు సీసాలో 200 గ్రాముల ఆవ నూనె వేసుకోవాలి. 

ఆ నూనెలో ఈ మూటను పెట్టి మూడు రోజుల పాటు ఎండలో ఉంచాలి. మూడు రోజుల తర్వాత ఈ నూనెను తలకి ఉపయోగించవచ్చు. నూనెను తలకు అప్లై చేసి రెండు నిమిషాల పాటు మంచిగా తలను మసాజ్ చేసి  ఒక గంట పాటు అలాగే వదిలేయాలి తరువాత ఏవైనా షాంపుతో తలస్నానం చేయవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు పొడవుగా, ఒత్తుగా చాలా త్వరగా పెరుగుతుంది.

 ఉసిరి మీ జుట్టుకు గొప్పది ఎందుకంటే ఇది హెయిర్ ఫోలికల్స్‌ను బలపరుస్తుంది మరియు ఆక్సీకరణ ఒత్తిడి యొక్క బయోమార్కర్లను తగ్గిస్తుంది.  ఇది తలలో రక్త ప్రసరణను పెంచుతుంది, తద్వారా జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.  ఇది చుండ్రు సమస్యను నిర్వహించడంలో సహాయపడుతుంది మరియు అకాల తెల్ల జుట్టును నివారిస్తుంది. కలోంజి నూనెలో నిగెలోన్ మరియు థైమోక్వినోన్ ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడానికి మరియు జుట్టు తిరిగి పెరగడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది వెంట్రుకల కుదుళ్లకు పోషణనిస్తుంది మరియు జుట్టు రాలిపోకుండా చేస్తుంది.  

 ఆవ నూనెను ఉపయోగించడం వల్ల మందులు లేకుండా, జుట్టు తిరిగి పెరగడానికి సురక్షితమైన మరియు సహజమైన మార్గంగా చెప్పబడింది. మెంతి గింజలు ఐరన్ మరియు ప్రొటీన్ యొక్క గొప్ప మూలం – జుట్టు పెరుగుదలకు రెండు ముఖ్యమైన పోషకాలు. అదనంగా, ఒక జంతు అధ్యయనంలో మెంతి గింజల సారంతో కూడిన మూలికా నూనె మిశ్రమం యొక్క సమయోచిత ఉపయోగం జుట్టు పెరుగుదల మరియు మందాన్ని పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుందని కనుగొంది. అందుకే ఈ నూనెను తయారు చేసుకొని వాడుకోవడం వలన జుట్టు పెరుగుదలకు అద్భుతంగా సహకరిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!