అరటిపండు లేని శుభకార్యం ఉండదు. అరటి చెట్టు యొక్క దాదాపు అన్ని భాగాలను ఉపయోగించవచ్చు. మనం రోజూ తినే అరటిపండ్లు అన్ని తరగతుల వారికి అందుబాటు ధరలో ఉంటాయి. అయితే చాలామంది ఎక్కువగా అరటి తోటలు ఉన్న ప్రాంతంలో అరటి పువ్వును కూడా ఆహారంలో భాగంగా తింటారు. ఈ అరటి పువ్వును వివిధారకాల వంటకాలుగా వండుకుని తినడం ఎప్పటినుండో ఉంది. అరటి పువ్వులో కేలరీలు, ప్రోటీన్, కొవ్వులు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, రాగి, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఇ మొదలైన విటమిన్లు మరియు పోషకాలు ఉంటాయి. అరటి పువ్వును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూడాల్సిందే మరి. అరటి పువ్వుల ప్రయోజనాలు
అంటువ్యాధులు అరికడుతుంది.
అరటి పువ్వులు అంటువ్యాధులకు చికిత్స చేస్తాయి, అరటి పువ్వులో ఉండే ఇథనాల్ లక్షణాలు వ్యాధికారక బాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. వాటిలో కొన్ని బాసిల్లస్ సబ్టాలిస్, బాసిల్లస్ సెరియస్ మరియు ఎస్చెరిచియా కోలి. మొదలైన బ్యాక్ట్రియా పెరుగుదలను నిరోధిస్తుంది. అంతేకాదు గాయాలను నయం చేయడానికి కూడా సహాయపడుతుంది.
ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలిస్తుంది
శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఉండటం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అరటి పువ్వులో ఉన్న మిథనాల్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలిస్తుంది. వృద్ధాప్యం మరియు క్యాన్సర్ వంటి అనేక సమస్యలకు చికిత్స చేస్తుంది.
ఋతు రక్తస్రావం తగ్గిస్తుంది
ఋతుస్రావం స్త్రీలలో ఎంత సహజమో ఆ సమయంలో కలిగే ఇబ్బంది కూడా అంత సహజంగా అనిపిస్తుంది కానీ కొందరిలో అధిక ఋతుస్రావం వల్ల అనీమియా వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా రక్తం పోవడం వల్ల నీరసం, బలహీనత,రోగనిరోధకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు చుట్టూ ముడతాయి. అలాటి సమయంలో ఒక కప్పు వండిన అరటి పువ్వులు ఈ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. పెరుగు లేదా పెరుగుతో పాటు వండిన అరటి పువ్వులు తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ను పెంచి రక్తస్రావం తగ్గిస్తాయి.
డయాబెటిస్ తగ్గించడంతో పాటు హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుతుంది.
అరటి పువ్వు ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది. అలాగే శరీరంలోని మొత్తం హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచుతుంది.
విటమిన్లు మరియు ఖనిజాలను భర్తీ చేస్తుంది.
అరటి పువ్వులలో విటమిన్ ఎ, సి, ఇ వంటి విటమిన్లు ఉంటాయి. అలాగే పొటాషియం మరియు ఫైబర్స్ కూడా అరటి పువ్వులో ఉంటాయి. పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు తరచుగా అరటి పువ్వు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి సమృద్ధిగా అందుతుంది.
మానసిక స్థితిని పెంచి ఆందోళనను తగ్గిస్తుంది
అరటి పువ్వులో మెగ్నీషియం ఉన్నందున, ఇవి ఆందోళనను తగ్గిస్తాయి మరియు మానసిక స్థితిని పెంచుతాయి. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజ యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తాయి. మెదడు మీద ఒత్తిడి తగ్గించి
బాలింతలకు మంచిది
ప్రసవం తరువాత మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటారు వాటిలో బిడ్డకు సరిపడినంత పాలు వృద్ధి కాకపోవడం కూడా ఉంటుంది. అరటి పువ్వును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బాలింతల్లో పాలు వృద్ధి అవుతాయి. ఫలితంగా బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని అందించిన వారు అవుతారు. తల్లి పాలద్వారా బిడ్డకు రోగనిరోధక శక్తి ఎక్కువగా అందుతుందనే విషయం అందరికి తెలిసినదే.
చివరగా……
అరటి పువ్వు ప్రకృతి సహజమైనది దీన్ని తాజాగా దొరికినపుడు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పైన చెప్పుకున్న ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.