Benefits of Coconut Breaking during festival day

పండగ రోజు కొట్టిన టెంకాయ ఎలా పగిలితే ఎలాంటి ఫలితం

మనం భగవంతుని దగ్గర కొబ్బరికాయ కొడుతుంటాం. ఇలా కొట్టడం వలన మన పాపాలను, అహంకారాన్ని దేవుని ముందు వదిలేసినట్టు భావిస్తాం. అయితే కొబ్బరికాయ కరెక్టుగా సగానికి పగలాలి అని లేకపోతే మంచిది కాదని భావిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం. కొబ్బరికాయ పగలడం వలన కూడా మనకి సూచనలు ఉంటాయా అని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. కొబ్బరికాయను కొట్టినప్పుడు అది సరిగ్గా సగానికి పగిలింది అంటే మనకు మంచి జరుగుతుందని చెబుతుంటారు.

 కొంతమందికి అడ్డదిడ్డంగా కొబ్బరికాయ పగులుతుంది. కొందరికి కొబ్బరికాయ సరిగ్గా పగులుతుంది అంటే వారికి టెక్నిక్ అర్థం అయి ఉంటుంది. లేదా వారు శ్రద్ధగా కొట్టి ఉండవచ్చు. కొంతమంది మనసులో ఆందోళనలు, భయాలతో కొబ్బరికాయలు కొడతారు. అలాంటప్పుడు అది అడ్డదిడ్డంగా పగులుతుంది. దీన్ని మంచి లేదా చెడుకు అన్వయించుకోవాల్సిన అవసరం లేదు. ఇక కొంతమంది కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతుంది. దీన్ని చెడు గా భావిస్తారు. కానీ కొబ్బరికాయ కుళ్ళిపోవడం వలన కొట్టిన వారికి లేదా కొబ్బరికాయకి దోషం లేదని చెబుతారు. 

కొబ్బరికాయ కుళ్ళిపోతే కాళ్ళు, చేతులు కడుక్కుని పూజామందిరాన్ని శుభ్రం చేసి మరొక కొబ్బరికాయ కొట్టడం మంచిది. అలాగే కొంతమంది వాహనాలకు పూజ చేసి కొబ్బరికాయ కొడుతుంటారు. ఇలాంటప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే మనసులో ఏ భయాలు పెట్టుకోకుండా వాహనాన్ని శుభ్రం చేసి మరొక కొబ్బరికాయ కొట్టాలి. ఇలా కొట్టడం వలన మంచి జరుగుతుంది. అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచి జరుగుతుందని అర్థం. కొత్తగా పెళ్లయిన వారికి ఇలా పువ్వు వస్తే వారి జీవితం సుఖ సంతోషాలతో మంచి సంతాన వృద్ధి జరుగుతుంది. 

ఇక కొబ్బరికాయ నిలువుగా పడవ ఆకారంలో పగిలితే ఆ ఇంట్లో ఉన్న కోడలు లేదా కూతురుకి గర్భధారణ జరగబోతుందని నమ్ముతారు. ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు మంచి మనసుతో ధర్మమైన కోరికలతో కొట్టడం వలన అవి నెరవేరుతాయి. చెడు ఆలోచనలతో ఆందోళన, భయాలతో కొట్టడం వలన అవి నెరవేరవు. అందుకే గుడికి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. దేవుని పై మనసు  పెట్టి మంచిని మాత్రమే కోరుకోవాలి.

Leave a Comment

error: Content is protected !!