హలో ఫ్రెండ్స్ ప్రతిరోజు మనందరం చేసే ఒక చిన్న పొరపాటు గురించి తెలుసుకుందాం. ఈ తప్పు వల్ల మనకు తెలియకుండా మన శరీరం ఎన్నో అనారోగ్యాలకు గురి అవుతుంది. అదేంటంటే ఉదయం నిద్ర లేవగానే ముందుగా నోరు పుక్కిలించడం. ఆ తర్వాత ఏదో ఒకటి తినడం తాగడం చేయడం. ఈరోజు మనం ఉదయాన్నే నోరు పుక్కిలించకుండా పరగడుపున నిద్ర లేవగానే గోరువెచ్చగా ఉండే నీరు తాగితే మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి తెలుసుకుందాం.
మంచి నీరు మన శరీరానికి చాలా అవసరం ఇది మన అందరికీ తెలిసిన విషయమే. భోజనం తినకుండా ఉండగలనేమో కానీ మంచి నీరు తాగకుండా అసలు జీవించలేను. ఉదయాన్నే నిద్ర లేవగానే పరగడుపున అన్నింటికన్నా ముందుగా మంచి నీరు తాగితే నీళ్ళలో ఉండే పోషక గుణాలు మన శరీరంపై రెండు రెట్లు అధికంగా పనిచేస్తాయి.
మనం ఉదయాన్నే నిద్ర లేవగానే మన నోట్లో ఉండే ఉమ్మి అంటే సెలైవ మన శరీరానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయాన్నే మనం నోరు పుక్కలించకుండా మంచినీటిని తాగితే నోటిలో ఉండే ఉమ్మి మంచి నీళ్లతో పాటు కలిసి మన కడుపు లోకి వెళుతుంది. దీని వల్ల ఉమ్మిలో ఉండే ప్రోబయోటిక్స్ మన కడుపులో ఉండే అవయవాలను చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. దీనివల్ల మన డైజెస్టివ్ సిస్టం యాక్టివ్ అవుతుంది. అలాగే మన కడుపులో వచ్చి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను సులభంగా తగ్గిపోతాయి.
మలబద్ధకం లాంటి సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. మీకు మలబద్దకం సమస్య ఉంటే ఉదయాన్నే పరగడుపున మంచి నీళ్లు తాగండి. ఉదయాన్నే పరగడుపున మంచినీరు తాగితే మీ ముఖంపై ఉండే పింపుల్స్ కూడా తగ్గిపోతాయి. ఈ రోజుల్లో మనం తినే తప్పుడు ఆహార పదార్థాల వల్ల మన ముఖం పై పింపుల్స్ వస్తూ ఉంటాయి. పరగడుపున నీళ్లు తాగడం వలన మన రక్తం శుద్ధి జరిగి పింపుల్స్ మాయమవుతాయి. అంతేకాదు మీ ముఖం మంచి గ్లో కూడా వస్తుంది. మీ కడుపులో గ్యాస్ ఫార్మ్ అవడం కీళ్ల నొప్పులు రావడం ఇలాంటి సమస్యలు ఉంటే మీరు కూడా ఉదయాన్నే పరగడుపున మంచి నీరు తాగాలి.
మనిక : ఈ వెబ్ సైట్ లో పెడుతున్న వివరాలన్నీ పాఠకుల ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా పాఠకుల అవగాహన పెంచడానికి మాత్రమే ..ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు