ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. ఉసిరి మనకు చేసే మేలుకు కృతజ్ఞతతో ఉసిరిని పూజిస్తుంటారు. ప్రకృతి ఆహారం గురించి సరిగ్గా అవగాహన లేని రోజుల్లో పెరుగన్నం, మజ్జిగన్నం తినేవారు. సీజనల్గా దొరికే పండ్లు, ఫలాలు తీసుకునేవారు కాదు. దాంతో వీరిలో రక్షణవ్యవస్థ తక్కువగా ఉంటుంది. శరీరంలో విటమిన్ సి నశింస్తుంది. దానితో పోషకాలు అందవు. విటమిన్ సి ఉసిరిలో అధికంగా లభిస్తుంది. విటమిన్ సి అధికంగా న్ని పదార్థాలు కంటే ఉసిరిలో ఎక్కువగా ఉంటుంది.
అందరూ ఉసిరిని ఎక్కువగా వాడుకోవాలని వాటి గొప్పతనం అర్థమవ్వాలని బుషులు పూజలు లాంటివి మన భారతదేశ ధార్మిక వ్యవస్థ లో స్థిరపరిచారు. వైరస్లను అడ్డుకోవడానికి విటమిన్ సి చాలా అవసరం. మనిషికి రోజుకు యాభై మిల్లీగ్రాముల విటమిన్ సి కావాలి. 100గ్రాముల పెద్ద ఉసిరి కాయలో ఆరొందల గ్రాముల విటమిన్ సి ఉంటుంది. పులుపు వలన ఎక్కువగా తినలేంకనుక సీజనల్గా దొరికే ఉసిరిని పూర్వకాలంలో నుండి ఎండబెట్టి దాచుకోవడం, తేనెలో వేసుకుని తినేవారు.
రోగనిరోధక శక్తి పెరగాలని ఈమధ్య కాలంలో ఉసిరిని తినడం ఎక్కువగా ఉంది. తేనెలో ఉసిరిని ఊరబెట్టి అమ్ముతుంటారు. కానీ ఉసిరిని తేనెలో నానబెట్టుకుని తినడం మంచిదేనా .కాదని నిపుణుల అభిప్రాయం. కావాలంటే ఉసిరిని ఎండబెట్టుకుని లేదా తాజాగా దొరికినప్పుడల్లా తినడం మంచిది. ఈ ఉసిరి ముక్కలు భోజనం తర్వాత ఒఖటి రెండు పలుకులు తినండి. రోజులో ఎప్పుడు తిన్నా పరవాలేదు. వాటివలన లాభం తప్ప నష్టం లేదు. మద్యపానం, ధూమపానం, గుట్కాలు పాన్పరాగ్ లాంటి వాటిపై ఆసక్తి తగ్గుతుంది.
దానివలన స్వీట్స్ పై కూడా ఇంట్రస్ట్ తగ్గుతుంది. తేనెలో ఊరబెట్టి తినమని అందరూ చెబుతుంటారు. కానీ ఇప్పటి కాలంలో అసలైన తేనె 99% దొరకడంలేదు. ఉసిరిని అలాంటి నకిలీ తేనెలో వెయ్యడంతో ఉసిరిలో ఉండే తేమకి ఆ తేనె కూడా పాడయిపోతుంది. ఫంగస్ వస్తుంది. కొంత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. పట్టు తేనె కూడా ఐదారు నెలల్లో రంగుమారడం, పులిసిపోవడం జరుగుతుంది. అందుకే వీలైనంత వరకూ అలా ఉపయోగించకపోవడం మంచిది.
అలా ఊరబెట్టిన ఉసిరికాయల్లో బాక్టీరియా, వైరస్ ఫంగస్ ఏర్పడుతుంటాయి. బయటకు నోరూరించే వీటిలో ఇంతప్రమాదం ఉంటుంది. వీలైతే దొరికినప్పుడల్లా ఎండబెట్టుకుని ముక్కలు చప్పరించడం లేదా పోడిలా చేసుకుని తేనెతో కలిపి తీసుకోవడం రోగనిరోధక శక్తిని పెంచడానికి మంచిది. సిరి ఆరోగ్యానికి మంచిదని ఆవకాయలా తినడం, తేనెలో ఊరబెట్టడం మంచిది కాదు.
మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి