◆ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అంటారు మన పెద్దలు. పెద్దలు మాత్రమే కాదు ఆరోగ్య నిపుణులు కూడా ఇదే చెబుతారు. టిఫిన్లు, వంట, ప్రత్యేక వంటకాలు ఇలా ఏదైనా సరే ఉల్లిపాయ లేని వంట రుచి ఉండదు. కొన్ని ఆహారపదార్థాలలో పచ్చి ఉల్లిపాయను కొరుక్కుని తినడం అద్భుతమైన రుచిని అందిస్తుంది. తీపి, ఘాటు కలగలసిన ఉల్లిపాయ రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి మంచి కాపలాదారు అని చెప్పుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.
◆ ఉల్లి మాత్రమే కాదు ఉల్లి కాడలను కూడా కూరల్లో విరివిగా ఉపయోగిస్తారు. ఉల్లిపాయలో మన శరీరానికి కావలసిన పోషక పదార్థాలు చాలా వున్నాయి. తేమ, ప్రోటినులు, కొవ్వులు, ఖనిజాలు, విటమిన్ సి, ఇనుము, భాస్వరం, కెరోటిన్, కాల్షియం, పీచు పదార్థం మొదలైనవి లభిస్తాయి.
◆ఉల్లిపాయ రుచి కోసం మాత్రమే కాకుండా ఔషధంగా కూడా పనిచేస్తుంది. గుండెకు బలాన్ని కలిగిస్తుంది. అజీర్తి వ్యాధులను నివారించి జీర్ణక్రియను సక్రమంగా ఉండేలా చేస్తుంది. ఉల్లిపాయ ఆకలిని పుట్టించడంలో తోడ్పడుతుంది. అలాగే నోటి అల్సర్లు తగ్గించి దంత సంరక్షణలో పాత్ర వహిస్తుంది.
◆పురుషుల్లో వీర్య వృద్ధికి, వీర్యం చిక్కగా అవ్వడంలో ఉల్లిపాయ దోహదం చేస్తుంది. శరీర పుష్టిని కలిగిస్తుంది. నరాలకు పటుత్వం పెంచుతుంది. శరీరంలోని విషపదార్థాలను నశింపజేసి మూత్ర సంబంధమైన వ్యాధులను అరికడుతుంది.
◆ఎముకలకు శక్తిని ఇచ్చి, మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. రక్తపోటును క్రమబద్దీకరించడంలో దోహదం చేయడం మాత్రమే కాకుండా రక్తపోటు రాకుండా కూడా కాపాడుతుంది. చెవిపోటు ఉన్నపుడు పచ్చి ఉల్లిపాయ రసాన్ని చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది,అలాగే మూర్ఛపోయిన వారికి ముక్కుల్లో ఉల్లి రసాన్ని వేయడం వల్ల తొందరగా మాములు స్థితికి వస్తారు.
◆తేలు కుట్టిన వారు నొప్పి, మంటతో విలవిల్లాడిపోయేటపుడు అర ఔన్స్ ఉల్లిరసాన్ని తాగించడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
◆స్త్రీలలో ఋతుక్రమం అస్తవ్యస్తం అయినపుడు ఉల్లిపాయ తీసుకోవడం వల్ల సక్రమమవుతుంది. అంతే కాకుండా ఋతుక్రమ సమయాల్లో కలిగే తిమ్మిర్లు, బాధలు వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఋతురక్తం ఎక్కువ తక్కువలు లేకుండా సాఫీగా జరిగేలా చేస్తుంది.
◆మహిళల్లో గర్భాశయానికి సంబందించిన వ్యాధులను నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
◆ఉల్లిపాయలు బాగా తినేవారికి కలరా వ్యాధి సోకదు మరియు ఉల్లిపాయ మెదడును చురుగ్గా ఉండేలా చేసి తెలివితేటల్ని మెరుగుపరుస్తుంది.
చివరగా…..
ప్రతిరోజు ఉల్లిపాయను కేవలం వంటల్లోనే కాకుండా ఎంతోకొంత పచ్చి ఉల్లిపాయను నేరుగా నమిలి తినడం వల్ల నోటి కి మరియు దంత సంరక్షణలోనూ, చిగుర్లను దృడంగా ఉంచడంలోనూ గొప్పగా పనిచేస్తుంది.