Benefits of eating three Dried Dates every day

7రోజులు తీసుకుంటే 100ఏళ్ళు వచ్చినా ఎముకలు, కీళ్ళనొప్పులు, రక్తహీనత, ఒంటినొప్పులు తగ్గిపోతాయి

శరీరంలో కాల్షియం, ఐరన్ లోపం ఏర్పడినప్పుడు లేదా వయసు పెరుగుతున్నప్పుడు ఎముకలు, కీళ్ల నొప్పులు రావడం సహజం. వీటిని తగ్గించుకోవడానికి ఒక వయస్సు వచ్చిన తర్వాత తప్పకుండా క్యాల్షియం, ఐరన్ ఉండే ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. విటమిన్ల లోపం లేకుండా మంచి ఆహారం తీసుకోవడం వలన ఎంత వయసు వచ్చినా కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటివి లేకుండా ఉత్సాహంగా తిరుగుతారు. పిల్లల్లో ఎముకల పెరుగుదల మెరుగుపడటానికి, ఆరోగ్యంగా ఉండడానికి రక్త హీనత ఏర్పడ కుండా కాపాడుకోవడానికి మనం ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. 

దాని కోసం మనం ఎండు ఖర్జూరాలు తీసుకోవాలి. ఎండిన ఖర్జూరాల్లో కూడా పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి.  ఈ సమ్మేళనాలు మెరుగైన జీర్ణక్రియ, మధుమేహం నిర్వహణ మరియు క్యాన్సర్ నివారణ వంటి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.  అనేక ఎండిన పండ్లలో అధిక పాలీఫెనాల్ కంటెంట్ ఉన్నప్పటికీ, ఎండిన ఖర్జూరాలు అత్యంత ప్రధాన మూలం. తర్వాత పదార్థం బాదం పప్పులు. బాదం మీ శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.  అవి LDL (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి మరియు విటమిన్ E, మెగ్నీషియం మరియు పొటాషియంతో నిండి ఉంటాయి, ఇవి ఆక్సిజన్ మరియు పోషకాలు రక్తం ద్వారా మరింత స్వేచ్ఛగా ప్రవహించడంలో సహాయపడతాయి.  

ఆరోగ్యకరమైన గుండెకు బాదం చాలా బాగా సహాయపడుతుంది. బాదం ఎముకలను పెంచే ఆహారం. అంతేకాకుండా శరీరంలో నొప్పులను తగ్గించడానికి కూడా బాదం ఉపయోగపడుతుంది. తర్వాత ఒక ఐదారు ఎండు ఖర్జూరాలు, ఆరు బాదంపప్పులను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం బాదంపప్పులపై తోలు తీసేసి ఖర్జూరం యొక్క విత్తనాలను తొడిమ తొలగించి ఈ రెండింటిని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఖర్జూరం, బాదంపప్పు పేస్ట్ వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. ఒక గ్లాసు పాలు మరిగించి అందులో ఒక స్పూన్ ఖర్జూరం, బాదం పేస్ట్ వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేయాలి. 

పసుపులో యాంటి బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచి నొప్పులను అదుపు చేస్తాయి. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోవాలి. పాలు బాగా మరిగిన తరువాత ఒక స్పూన్ బెల్లంపొడి వేసి  వేడిగా ఉన్నప్పుడు ఈ పాలను తాగాలి. మధుమేహం ఉన్నవారు బెల్లం లేకుండా ఈ పాలను తాగవచ్చు. ఇలా కొన్ని రోజులు చేయడం వలన శరీరంలో క్యాల్షియం ఐరన్ లోపాలు అధిగమించబడి శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అవుతాయి. ఎముకలు గట్టి పడి నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!