రాత్రి పడుకునే ముందు చాలా మందికి గోరు వెచ్చని పాలు తాగడం అలవాటు ఉంటుంది. అయితే చాలా మంది పాలలో పంచదార వేసుకోవడం పరిపాటి. అయితే రాత్రిపూట పాలలో పంచదార బదులు బెల్లం వేసుకుని తాగడం వల్ల గొప్ప ప్రయోజనాలు కలుగుతాయని చాలా తక్కువ మందికి తెల్సి ఉంటుంది. మరి ఆ ప్రయోజనాలు మనం కూడా పొందాలి అంటే పాలలో బెల్లం కలిపి పడుకునే ముందు తీసుకుంటే కలిగే ఆ ప్రయోజనాలు తెలుసుకుందాం.
◆ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీటితో బెల్లం తీసుకోవడం చాలా ప్రయోజనాలు ఉంటాయని అందరికి తెలుసు. కాని రాత్రి పడుకునే ముందు పాలతో బెల్లం కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చక్కెర తినడం వల్ల రక్తంలో సల్ఫర్ స్థాయి పెరుగుతుంది, దీనివల్ల చక్కెర స్థాయిలు పేరుకుపోయి మధుమేహం తొందరగా వచ్చేస్తుంది. అయితే బెల్లం శరీరానికి శక్తిని సమకూర్చడంలో సహాయపడుతుంది. రుచితో మధురంగా ఉంటూనే అనేక పోషకాలను కలిగి ఉంటాయి. కాల్షియం, భాస్వరం, ఇనుము, పొటాషియం, జింక్, ప్రోటీన్, విటమిన్ బి పోషకాలు పుష్కలంగా కనిపిస్తాయి. అలాగే, పాలు కాల్షియం కు మంచి ఎంపిక అనే విషయం మనకు తెలిసినదే.
◆ దీన్ని రోజూ తీసుకుంటే, కడుపుకు సంబందించిన సమస్యల నుండి ఉపశమనం పొందడమే కాకుండా అనేక ఇతర సమస్యలను కూడా అధిగమించవచ్చు. బెల్లం శరీరం యొక్క జీవక్రియను మెరుగుపరుస్తుంది, రక్త ప్రసరణ చురుగ్గా ఉండేలా సహాయపడుతుంది. అయితే పాలతో తీసుకోవడం వల్ల దాని బలం మరింత పెరుగుతుంది!
◆ పాలలో విటమిన్ ఎ, విటమిన్ బి మరియు డి, లాక్టిక్ ఆమ్లం అధిక మొత్తంలో కనిపిస్తాయి. మరోవైపు, బెల్లంలో సుక్రోజ్, గ్లూకోజ్, మినరల్ లిక్విడ్ మరియు నీరు పెద్ద మొత్తంలో కనిపిస్తాయి.
◆రాత్రి పడుకునే ముందు వెచ్చని పాలతో బెల్లం తీసుకోవడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఏదైనా జీర్ణ సమస్యలు ఉంటే, వేడి పాలు మరియు బెల్లం తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
◆పాలతో బెల్లం తీసుకోవడం వల్ల కీళ్లలో నొప్పి కూడా తగ్గుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో కీళ్ల నొప్పి పెరుగుతుంది. ఈ సమయంలో బెల్లం తో పాలు తీసుకోవడం ఉత్తమం. అలాగే చర్మానికి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది..
◆పాలలో చక్కెర బదులుగా బెల్లం వాడితే బరువు తగ్గడం సులువు. బెల్లం అనేక సమ్మేళనాలను కలిగి ఉంది, ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
◆ శరీరంలో ఉన్న మలినాలను శుభ్రపరచడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. పాలతో బెల్లం కలవడం వల్ల శరీరంలో అవయవాలకు అవసరమైన పోషకాలు అందుతాయి. రక్త వృద్ధి పెరుగుతుంది. మంచి నిద్ర చేకూర్చుతుంది.
◆ నెలసరి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
బెల్లం మరియు పాలు తీసుకోవడం నెలసరి నొప్పిని తగ్గిస్తుంది. అంతర్గత కండరాల సంకోచాన్ని తగ్గించి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
చివరగా….
పాలు బెల్లం అనేవి సహజమైన పోషకాహారాలను నిండుకున్న గొప్ప పదార్థాలు వీటి కలయిక శరీరానికి గొప్ప శక్తిని ఇస్తూనే దృడంగా ఉంచుతుంది.