Benefits Of Rose Water For Skin In Telugu

రోజ్ వాటర్ ఇలా వాడితే ఆశ్చర్యపోయే పలితాలు పక్కా!!

సౌందర్య  స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికి రోజ్ వాటర్ గూర్చి తెలిసే ఉంటుంది. చాలామంది ఫేస్ పాక్ లలోనూ మరియు రోజువారీ అలంకరణ లోనూ రోజ్ వాటర్ ను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. చర్మాన్ని తాజాగా ఉంచడంతో పాటు, కాంతివంతంగా ఉంచే రోజ్ వాటర్ చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ముఖ్యంగా చర్మ సంరక్షణలో సింహ భాగాన్ని ఆక్రమించిన రోజ్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు చూడండి

◆  రోజ్‌వాటర్ చర్మం యొక్క పిహెచ్ బ్యాలెన్స్‌ను సమతుల్యతగా ఉండేలా చేస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంగుంది,  చికాకు కలిగించే చర్మం యొక్క ఎరుపును తగ్గించడానికి, మొటిమలు, చర్మ సంబంధ సమస్యలు మరియు తామర వంటి మొండి సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది.  చర్మంపై ఏర్పడే జిడ్డును తొలగిస్తుంది. 

◆వడలిపోయిన చర్మాన్ని తిరిగి తాజాగా చేయడంలో రోజ్ వాటర్ దోహాధం చేస్తుంది. ఎండ, అలసట వల్ల చర్మం నిస్తేజంగా తయారైనపుడు రోజు వాటర్ ను మొహానికి అప్లై చేయడం ద్వారా తాజాదనాన్ని సంతరించుకుంటుంది. అలాగే చర్మ రంద్రాలను శుభ్రపరిచి మొటిమలు, మచ్చలు వంటి వాటిని దూరంగా ఉంచుతుంది.

◆ రోజ్ వాటర్ గొప్ప  హైడ్రేట్ సాధనంగా పనిచేస్తుంది. ఇది చర్మానికి పునరుజ్జీవనాన్ని ఇచ్చి చర్మానికి తేమను అందించి మృదువుగా ఉండేలా చేస్తుంది.  ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా, రోజ్ వాటర్ మచ్చలు,  గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది.

◆ దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మ కణాలను బలోపేతం చేయడానికి మరియు చర్మ కణజాలాలను పునరుత్పత్తి చేయడానికి సహాయపడతాయి.  చర్మ రంధ్రాలను శుభ్రపరచడానికి మరియు చర్మాన్ని టోన్ చేయడానికి సహాయపడుతుంది. చర్మానికి ఆవిరి పట్టుకున్న తరువాత  రోజ్ వాటర్ అప్లై చేయడం వల్ల  మచ్చలను సులువుగా తగ్గిస్తుంది.  

◆రోజ్ వాటర్ వాసన  మూడ్ మార్చడంలో దోహదపడుతుంది. చిరాకు, అనాసక్తి, అసహనం వంటి వాటిని దూరం చేస్తుంది. అలాగే ఆందోళన  తొలగించి  మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. తద్వారా రిలాక్స్ ఇవ్వడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఇందులోని తేమ లక్షణాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే చుండ్రు నివారణకు కూడా తొడపడుతుంది..  రోజ్‌వాటర్ సహజమైన కండీషనర్ గా ఉపయోగించవచ్చు. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. 

◆ నిద్రలేమితో బాధపడేవారు తలగడకు కాస్త రోజ్ వాతం ను స్ప్రే చేయడం వల్ల మంచి నిద్ర సొంతమవుకుంది. అలాగే రోజు రాత్రిపూట రోజ్ వాటర్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం మీది ముడతలు తొలగిపోయి యవ్వనంగా తయారవుతుంది.

◆అలాగే అందరూ ప్రస్తుతం సహజంగా వాడుతున్న మేకప్ ను తొలగించడంలో రోజ్ వాటర్ ఉత్తమంగా పనిచేస్తుంది.రోజ్ వాటర్ లో కొన్ని చుక్కల కొబ్బరినూనె కలిపి మేకప్ ను సులువుగా తొలగించవచ్చు.

 చివరగా….

రోజ్ వాటర్ ను బోలెడు పద్దతులలో ఉపయోగించవచ్చు. దీని ప్రభావం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా చర్మసంరక్షణలో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే కొన్నిరకాల వంటకాలలో కూడా రోజ్ వాటర్ తన ప్రత్యేకతను కలిగి ఉంది.

Leave a Comment

error: Content is protected !!