Benefits of Sesame Seeds Telugu

తక్షణ శక్తిని ఇచ్చే మన వంటింట్లో ఉండే వీటిని తప్పక తినండి!!

తక్షణ శక్తిని ఇచ్చే ఓ పసందైన ఆహార దినుసు ఏంటి నవ్వుల వాన కురిపించే నువ్వుల  గురించిఎన్ని నిజాలు తెలుసు మీకు. నువ్వులు ఆహారంలో తీసుకోవడం వల్ల తక్షణ శక్తిని ఇస్తాయి.నువ్వుల వల్ల ఉన్న లాభాలు ఏంటో, మన ఆరోగ్యానికి అవీ ఎలా సహకరిస్తాయో ఇక ఆలస్యం చేయకుండా చదవండి మరి.

◆మనకి మామూలుగా నువ్వుల గురించి, లడ్డూలు, చిక్కి లేదా,పిండివంటల్లో వేసుకోవడం అప్పుడప్పుడు నువ్వుల పొడి చేసి కూరల్లో వేసుకోవడం,లేదా నువ్వుల పచ్చడి చేసుకోవడం ఇలాంటివే తెలుసు. నూనె ఆడించుకుని వంటలలో పచ్చళ్ళల్లో వేసుకోవడం మాత్రమే తెలుసు ఇంతవరకు.

◆నువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వుల లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు నువ్వులను తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఇవి చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అదే పోషకం రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.

◆రక్తహీనత ఉన్నవారికి నువ్వులు ఒక వరం అని చెప్పవచ్చు. రక్తహీనత ఉన్నవారు ప్రతి రోజు ఒక టీ స్పూన్ నువ్వులను నీళ్లలో నానబెట్టుకుని తింటే రక్త వృద్ధి చెందుతుంది. ఇలా 3 నెలలు చేయడం వల్ల ఫలితం చాలా బాగుంటుంది.

◆మలబద్దకం ఉన్నవారు నువ్వులను ఎక్కువ తినాలి ఇందులో ఉన్న పీచు పదార్థం  జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కడుపులో పేగుల్లో ఉన్న మలినాలను తొలగించి, మలబద్ధకాన్ని దూరంగా పారిపోయేలా చేస్తుంది.

◆నువ్వుల లో ఉండే క్యాల్షియం థయామిన్ వంటి పోషకాలు మనలో ఉన్న ఒత్తిడిని దూరం చేస్తాయి. అందుకే విద్యార్థులు నువ్వులనూ తమ ఆహారంలో భాగం చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది, చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది.

◆నువ్వుల లో ఉండే రాగి మన శరీరానికి సమృద్ధిగా అందడం వల్ల కీళ్ల నొప్పులు రమ్మన్నా రావు. మరియు ఎముకలు రక్తనాళాలు దృఢంగా మారుతాయి. నిత్యం నువ్వులని  తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలు అదుపులోకి వస్తాయి. శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. జీర్ణక్రియ రేటు వృద్ధి అవుతుంది.

◆ఎదుగుదల సరిగ్గా లేని పిల్లల్లో ప్రతిరోజు ఉదయాన్నే ఒక స్పూన్ నువ్వులను నీళ్లలో నానబెట్టి తినిపిస్తే ప్రయోజనం ఉంటుంది. కండరాల బలం లేని వృద్ధులకు పిల్లలకు కూడా నువ్వుల నూనెతో మసాజ్ చేస్తే మంచి ఔషధంలా పనిచేస్తుంది. నువ్వుల నూనె  చర్మ సౌందర్యాన్ని మరింత మెరుగు పరుస్తుంది.

◆రుతు సంబంధంగా వచ్చేహార్మోన్ సమస్యలు  కూడా అదుపులో ఉంటాయి. నువ్వులు బెల్లం కలిపి తీసుకోవడం వల్ల పీరియడ్స్ లో వచ్చే నడుము నొప్పి కడుపు నొప్పి అదుపులో ఉంటాయి. ఆ టైం ఆ సమయంలో కావాల్సిన పోషకాలు శరీరానికి అందుతాయి. నువ్వులనీ  ఇలా చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో  వాడుతూ ఉంటారు.

చివరిగా…. 

అయితే  నువ్వులను మోతాదు మించి తీసుకోకూడదు.అలా తీసుకుంటే అధిక బరువు, అరగకపోవడం, మోషన్స్ ఇలాంటి సమస్యలు వస్తాయి. కానీ నువ్వులు చాలా బలమైన ఆహారం. మన ఆరోగ్యాన్ని అందాన్ని పెంపొందించు కోవడానికి మనకి నువ్వులు బాగా సహాయం చేస్తాయి. కాబట్టి నువ్వులను మన ఆహారంలో భాగం చేసుకుంటే మనం మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు.

Leave a Comment

error: Content is protected !!