Benefits Of Spinach Bachali Aaku

ఈ ఒక్క ఆకు తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!!

ఒకప్పటి  గ్రామీణ వంటల్లో బచ్చలి కూర చాలా విరివిగా ఉపయోగించేవారు. రకరకాల వంటలు బచ్చలి కూరతో చేసుకునేవారు. ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో చూడండి ఒకసారి. 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

 బచ్చలికూరలో  ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  సరైన జీర్ణక్రియ కోసం డైటరీ ఫైబర్ తీసుకోవడం చాలా ముఖ్యం.  జీర్ణక్రియలో ఫైబర్ ప్రముఖ పాత్ర పోషించడం వల్ల బచ్చలికూర  ప్రేగులలో  కదలికను సులువు చేస్తుంది మరియు ప్రేగు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ నివారణ లక్షణాలు

 ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి, ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది మరియు క్యాన్సర్‌తో సహా మరిన్ని  అనారోగ్యాలను నివారిస్తుంది.  ఇందులోని విటమిన్ ఎ నోటి కుహరం మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నిరోధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

 బచ్చలికూరలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఇందులోని ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి గొప్పగా సహాయపడుతుంది.   ఫైబర్ సరైన మొత్తంలో తీసుకున్నప్పుడు కడుపు నిండుగా ఉన్న భావన కలగడం వల్ల తొందరగా ఆకలి వేయదు. మరొక ప్రయోజనం ఏమిటంటే తక్కువ కార్బోహైడ్రేట్ ఉండటం వల్ల ఇది ఉత్తమమైనది.

నిద్రను మెరుగుపరుస్తుంది

దీనివల్ల క్లైగే అనేక  ప్రయోజనాల్లో ఒకటి నిద్రను మెరుగుపరచడం.  బచ్చలికూరలో మెగ్నీషియం మరియు జింక్ రెండూ ఉన్నాయి- ఇవి రెండూ మానవ శరీరంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి.  మెగ్నీషియం శరీరంలోని కండరాలకు ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. అలాగే మెగ్నీషియం మరియు జింక్ లు పోషకాలను గ్రహించడంలో దోహదం చేస్తాయి. 

అనారోగ్యాన్ని నివారిస్తుంది

బచ్చలికూర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను తగ్గిస్తుంది. ఈ మొక్కలో అధిక విటమిన్ సి కంటెంట్ ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి జబ్బులను కలిగించే రోగకారక వైరస్ లు మరియు బాక్టీరియా తో పోరాడి అనారోగ్యం దరిచేరకుండా కాపాడుతుంది.   

రక్తపోటును నియంత్రిస్తుంది

 రక్తపోటు మనిషి శరీరంలో ఒక ముఖ్యమైన వ్యవస్థ. .  రక్తం నుండి  శరీరంలోని వివిధ అవయవాలు మరియు కణజాలాలకు ఆక్సిజన్ మరియు పోషకాలు అందించడంలో బచ్చలికూర లోని పొటాషియం దోహాధం చేస్తుంది. రక్త ప్రవాహాన్ని పెంచడానికి, హృదయ స్పందనను నియంత్రించడానికి మరియు ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

 ఫైబర్ యొక్క అనేక ప్రయోజనాల్లో ఒకటి రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలను తగ్గించడం.  అధిక ఫైబర్ ఆహారాలు తిన్నప్పుడు గ్లూకోజ్ గ్రహింపు నెమ్మదిగా ఉంటుంది. బచ్చలికూరలోని అధిక ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది  డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో సహాయపడుతుంది.

రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది

 ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో ఐరన్ కీలకమైన పాత్ర పోషిస్తుంది.  ఐరన్ లోపం  ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది.  ఇది ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్‌ను తీసుకెళ్లడం మరింత కష్టతరం చేస్తుంది అంతేకాదు ఇది రక్తహీనతకు కారణమవుతుంది.  బచ్చలికూరలోని ఐరన్ దీన్ని భర్తీ చేయడం ద్వారా రక్తహీనత ప్రమాదాన్ని అద్భుతంగా తగ్గిస్తుంది.

చివరగా…..

బచ్చలికూర అనేది తీగ జాతికి చెందిన ఆకుకూర. దీన్ని ప్రతి ఇంట్లో సులువుగా పెంచుకోవచ్చు. కాబట్టి మీకు ఆరోగ్యం కావాలంటే బచ్చలితీగను పెంచేయండి.

Leave a Comment

error: Content is protected !!