ప్రస్తుతం అందరం చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి కూడా టాబ్లెట్స్ మీద ఆధారపడుతున్నాం. దానిని ఫార్మా కంపెనీలు అదునుగా చూసుకుని కొత్త సమస్యలు తలెత్తే పరిస్థితి తెస్తున్నాయి. ఉదాహరణకి పంచదార మన దేశం లో అసలు తయారు చేయరు బయటి దేశం నుంచి ఉత్పత్తి చేసి వాడుకుంటున్నాం. షుగర్ వాడటం వలన డయాబెటిస్ సమస్య వస్తుంది. డయాబెటిస్ తగ్గించుకోవడం కోసం ఫార్మా కంపెనీ లో మందులు వాడుతాం.
డబ్బు ఖర్చుపెట్టి బయటి దేశం నుండి ఉత్పత్తులను కొనుక్కుని మరి రోగాలను కొని తెచుకుంటున్నాం. తలనొప్పి, చెవి నొప్పి, గొంతు నొప్పి ఇలా ఒక్కోదానికి ఒకొరకం టాబ్లెట్ వేసుకోవాలి. చిన్న సమస్యలకి కూడా పదుల సంఖ్యలో టాబ్లెట్స్ వాడుతున్నాం. మన పూర్వీకులు ఇంగ్లీష్ మందులు అవసరం లేకుండా ఆయుర్వేదం నమ్మి రోగాలను తtగ్గించుకునే వాళ్ళు. మన వంటింటిలో ఉండే వాటిలోనే ఎన్నో రోగాలను నయం చేసే గుణాలు ఉంటాయి. వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబేయేది పసుపు.
పసుపు రోజూ పాలలో కలిపి తీసుకోవడం వలన చాలా ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఒక గ్లాస్ పాలు తీసుకుని పావు టీ స్పూన్ పసుపు వేసి 5 నిముషాల పాటు మరిగించాలి. 2 టేబుల్ స్పూన్ల తేనె కలుపుకోవాలి. లేదా బెల్లం కలుపుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు హాఫ్ టేబుల్ స్పూన్ తేనె కలుపుకోవాలి. పసుపు కలిపిన పాలు తాగడం వలన డయాబెటిస్ ఉంటే తగ్గుతుంది. డయాబెటిస్ లేని వారికి డయాబెటిస్ రాదు. దీనిలో వేసే పసుపు ఆర్గానిక్ది అయ్యి ఉండాలి.
డైరెక్టుగా పసుపు కొమ్ములు తీసి పసుపు కొట్టించుకోవాలి లేదా స్వచ్ఛమైన పసుపు దొరికితే అది కూడా వాడుకోవచ్చు. అంతే తప్ప మార్కెట్లో దొరికేవి కలర్స్ లేదా ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అవి వాడటం వలన ప్రయోజనం లేకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. పసుపు కలిపిన పాలు తాగడం వలన గ్యాస్, అసిడిటీ, కడుపునొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. పసుపు కలిపిన పాలు తాగడం వల్ల రెండురోజుల్లో జలుబు తగ్గిపోతుంది. పసుపు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇంప్లిమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది.
మోకాళ్ళ నొప్పి, వాపు తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. రక్తంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవాళ్లు పసుపు కలిపిన పాలు తాగడం వలన బాగా నిద్రపడుతుంది.