మొలకెత్తిన గింజలు తింటే చాలా ఆరోగ్యకరంగా మన జీవన శైలి నడుస్తుంది అని అందరికీ తెలుసు కానీ మొలకెత్తిన గింజలు రుచికరంగా ఉండవని చాలామంది వాటిని ఇష్టపడరు. అటువంటివారు మొలకెత్తిన గింజలను ఇడ్లీ రూపంలో వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటాయి మరియు పోషకాలు కూడా అన్ని లభిస్తాయి. ఇడ్లీ వేసుకోవడం ద్వారా కొన్ని పోషకాలు కోల్పోతాము కానీ మొలకెత్తిన గింజలు సులభంగా తీసుకోవచ్చు. కానీ కోన్ని పోషకాలు అయినా లభిస్తాయి. అటువంటి స్ప్రౌట్స్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం.
వీటి కోసం మనకు ముందుగా కావాల్సింది మొలకలెత్తిన శనగలు అర కప్పు, మొలకెత్తిన పెసలు అర కప్పు, పెరుగు ఒక కప్పు, ఓట్స్ అరకప్పు, అల్లం ముక్కలు ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి మూడు. ఇప్పుడు ఇడ్లీ మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మొలకలు ఎత్తిన శనగలు, పెసలు ఓట్స్, పెరుగు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తని ఇడ్లీపిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోగా వచ్చిన మిశ్రమాన్ని ఇడ్లీ రేకులపై మిగడ రాసి ఇడ్లీ వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన ఇడ్లీ ఏదైనా గిన్నెలోకి తీసుకోవాలి.
చంటి పిల్లలకు ఈ రకమైన ఇడ్లీ పెట్టడం వలన పీచు పదార్థాలు, పోషకాలు అన్ని పుష్కలంగా లభిస్తాయి. ఇడ్లీ లోకి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పల్లీలు, రెండు పచ్చిమిరపకాయ ముక్కలు, ఖర్జూరం ముక్కలు కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము హాఫ్ కప్, కొద్దిగా పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుంటే సింపుల్గా కొబ్బరి చట్నీ తయారవుతుంది. కావాలి అనుకుంటే దీనికి కొద్దిగా మీగడవేసి అందులో జీలకర్ర, ఆవాలు కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకోవచ్చు.
ఇటువంటి ఇడ్లీ తయారు చేసుకుని తినడం వలన చక్కటి విలువలతో కూడిన మరియు పోషకాలతో కూడిన ఆహారం తిన్నట్టు ఉంటుంది. కానీ ఇటువంటి ఇడ్లిని రోజు తినడం వలన కూడా పూర్తి పోషకాలు మనకు లభించవు. కనుక ఎప్పుడైనా మొలకెత్తించిన గింజలు తినలేనప్పుడు ఈ రూపంలో ఉపయోగించుకోవచ్చు. కాని సాధారణ ఇడ్లీ, పూరి, దోస తినే కంటే ఇవి కొంచెం ప్రయోజనకరంగా ఉంటాయి. కనుక అప్పుడప్పుడు ఇలా ప్రయత్నించడం వలన ఎటువంటి నష్టం ఉండదు…