పాదాల పగుళ్ళు చాలామంది ఇబ్బందిపడే సమస్య. నడవడానికి నొప్పి మరియు చూడడానికి అసహ్యంగా ఉండే పాదాలతో ఇబ్బందిపడుతుంటారు. వీటికి ముఖ్యంగా పాదాలపై శ్రద్ధ పెట్టకపోవడం ఒక కారణమైతే శరీరంలో వేడి ఎక్కువవడం కూడా ఒక కారణం. చాలా మంది శరీరం వేడి శరీరం అయి ఉంటుంది. ఇలాంటి వారు నీటిని తాగడం తక్కువగా ఉంటే ఇంకా వేడి ఎక్కువయి చర్మం కాంతిని కోల్పోవడం, పగలడం వంటివి ఎక్కువవుతాయి.
ఇలాంటప్పుడు నీటిని ఎక్కువగా తాగడం ,యోగా చేయడంతో పాటు ఇంటి చిట్కాతో ఉపశమనం కలుగుతుంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
ఒక బంగాళదుంప తీసుకుని దానిని మిక్సీపట్టి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఆ బంగాళదుంప పేస్ట్ని వడకట్టి దాని రసం సేకరించాలి. బంగాళదుంప పాదాలపై ఉన్న నలుపుని పోగొట్టడంతో పాటు పాదాలపగుళ్ళను కూడా తగ్గిస్తుంది. బంగాళదుంప సహజ బ్లీచ్లా పనిచేస్తుంది.
దీంట్లో ఒక స్పూన్ టూత్ పేస్ట్ వేయాలి. మీరు వాడే పేస్ట్ ఏదయినా లేదా ఆయుర్వేదిక్ పేస్ట్ అయినా పరవాలేదు. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇందులోనె అరచెక్క నిమ్మరసం కలపాలి. నిమ్మకాయలోని యాసిడ్ గుణాలు పాదాలపై ఉన్న మురికి,బాక్టీరియా తొలగించడంలో సహాయపడతాయి. తర్వాత నిమ్మచెక్కను పడేయకుండా ఉంచుకోవాలి.
ఒక బకెట్ లేదా పాత్రలో గోరువెచ్చని నీళ్ళు తీసుకుని కొంచం ఉప్పు వెయ్యాలి. తర్వాత కాళ్ళను పదినిమిషాల పాటు ఇందులో ఉంచి నిమ్మచెక్క తో సర్క్యలర్ మోషన్లో మసాజ్ చేయాలి. ఇలా చేయడంవలన రక్తప్రసరణ మెరుగుపడి పాదాలు తిరిగి ఆరోగ్యంగా తయారవుతాయ. తర్వాత తయారుచేసుకున్న మిశ్రమాన్ని పాక్లా అప్లై చేసి ఆరాక మసాజ్ చేస్తూ కడిగేయాలి.
ఇలా వారానికి ఒకసారి చేస్తే పగుళ్ళలో పేరుకున్న మృతకణాలను, మురికిని తొలగించి పాదాలను మళ్ళీ ఆరోగ్యంగా చేస్తుంది. దీనితో పాటు ఎక్కువగా షూస్ వేసుకునేవారు పాడెడ్ షూస్ వేసుకోవాలి. దీనివలన చెమట పట్టడం కాళ్ళు పాడవడం తగ్గుతుంది.
అలాగే యోగాలో పాదాలను ఆరోగ్యం గా చేసే బస్త్రికలాంటి కొన్ని యోగాసనాలు ఉన్నాయి అంటే నమ్మబుద్ధి కావడంలేదు కదా. కానీ ఉన్నాయి. యోగా వలన పాదాలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే పచ్చికలో ఉదయాన్నే కొంతసేపు నడవడం వలన పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి.