కొంతమందికి, బరువు తగ్గడం కోసం ఎంత కష్టపడుతుంటారో అలాగే మరికొందరు బరువు పెరగడానికి కూడా కష్టపడుతుంటారు. ఎంత తిన్నా లావు కావట్లేదనే వారి బాధ, బక్కపలుచని దేహాన్ని చూసుకుంటూ నైరాశ్యంలోకి జారిపోతారు. అయితే ఆహారంలో కొన్ని చేర్చడం వల్ల బరువు పెరిగే ప్రయత్నాలు ఆరోగ్యంగా ఎలాంటి దుష్ప్రభావం లేకుండా చేయచ్చంటున్నారు నిపుణులు ఒకసారి అవేంటో చూద్దాం రండి.
ప్రోటీన్ మిల్క్ షేక్ లు.
ఇంట్లో తయారుచేసిన ప్రోటీన్ మిల్క్ షేక్ లు త్రాగటం బరువు పెరగడానికి అత్యంత పోషకమైన మార్గంగా చెప్పవచ్చు
సహజమైన చెక్కెరలు మరియు పోషకాలు లేనందున బరువు పెరగని వారు చాలామంది. అయితే ప్రోటీన్ షేక్ ల వల్ల రుచి మరియు శరీరానికి కండర పుష్టిని ఇస్తుంది. ఈ మిల్క్ షేక్ లు సుమారు 400–600 కేలరీలను కలిగి ఉంటుంది. , అధిక మొత్తంలో ప్రోటీన్ మరియు ఇతర ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తాయి.
పాలు
పాలు దశాబ్దాలుగా బరువు పెరగడానికి కండరాల నిర్మాణానికి పాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయ్.
ప్రోటీన్లు, పిండి పదార్థాలు మరియు కొవ్వుల గొప్ప సమ్మేళనం. కాల్షియం ఎక్కువగా అందే పదార్థాలలో పాలు ప్రథమ స్థానం.
పాలు పాలపదార్థాలను తీసుకోవడం వల్ల బరువు పెరగడం సులువు. పాలతో చేసిన తీపి పదార్థాలు కూడా బరువు పెంచడంలో తోడ్పడతాయి. పెరుగు, పనీర్, నెయ్యి కూడా బరువు పెంచడంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి.
ఉదయాన్నే గ్లాసుడు పాలలో తేనె కలుపుకుని తాగి ఒక అరటిపండు తినడం వల్ల ఆరోగ్యకరమైన పద్దతిలో వేగంగా బరువు పెరుగుతారు.
బియ్యం
బియ్యం బరువు పెరగడానికి మీకు అనుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడినది. ఇందులో పుష్కలంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి కండర నిర్మాణంలో తోడ్పడతాయి. అన్నం మన శరీర దారుఢ్యాన్ని పెంచుతుంది.
డ్రై ఫ్రూట్స్
మీరు బరువు పెరగాలని చూస్తున్నట్లయితే డ్రై ఫ్రూట్స్ బెస్ట్ ఆప్షన్ గా పని చేస్తాయి..
ముడి బాదంపప్పులో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అలాగే మిగిలిన డ్రై ఫ్రూట్ లో కూడా క్యాలరీలు అధికంగా ఉంటాయి. రోజూ సాయంత్రం వేళా గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో కూడిన బరువు పెరగవచ్చు.
అయితే డ్రై ఫ్రూట్స్ నాణ్యత చూసుకోవడం ముఖ్యం. అలాగే వేరుశనగలు, బెల్లం వంటి పౌష్టికరమైన పదార్థాలు తీసుకోవాలి.
బంగాళాదుంపలు మరియు పిండి పదార్ధాలు
బంగాళాదుంపలు మరియు ఇతర పిండి పదార్ధాలు అదనపు కేలరీలను జోడించడానికి చాలా సులభమైన మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్గం.
పిండి పదార్థాలు కలిగిన వాటిని ఎక్కువ తీసుకోవడం వల్ల కండర నిర్మాణం దృఢంగా ఉంటుంది. దుంపలలో ఈ పిండి పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.
క్వినోవా
వోట్స్
మొక్కజొన్న
బంగాళాదుంపలు మరియు చిలగడదుంపలు
స్క్వాష్
బీన్స్ మరియు చిక్కుళ్ళు మొదలైనవి తీసుకోవడం వల్ల సమతుల్య ఆహారం లభిస్తుంది.
బంగాళాదుంపలు మరియు ఇతర దుంపలు కేలరీలను జోడించి బరువు పెరగడానికి సహాయపడతాయి ఇవి కండరాల గ్లైకోజెన్ ను పెంచుతాయి.
గుడ్లు
గుడ్లు ఆరోగ్యకరమైన కండరాల నిర్మాణ ఆహారాలలో ఒకటి. ఇవి అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వుల గొప్ప కలయిక. ప్రతిరోజు గుడ్డును వివిధ రకాలుగా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బోర్ కొట్టదు కూడా.
చివరగా…..
బరువు తగ్గడం ఎంత కష్టమో, పెరగడం కూడా అంతే కష్టపడుతుంటారు. అయితే ఒక ప్లాన్ ప్రకారం ఆహారాన్ని తీసుకుంటూ ఫాలో అయితే తగ్గడం మరియు పెరగడం రెండూ సాధ్యమే మరియు సులభమే.