best fast food menu items for diabetics

షుగర్ వున్న వారికి ఇది గొప్ప వరం అని తెలుసా. తప్పకుండా పాటించండి

డయాబెటిస్ ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది దీని బారిన పడుతున్నారు. డయాబెటిస్ ఒకసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడుతూనే ఉండాలి అని డాక్టర్లు చెబుతుంటారు. అయితే డయాబెటిస్ వచ్చిన మనం మంచి ఆహారపుటలవాట్లు పాటించడం వలన షుగర్ ను రివర్స్ చేయవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. డయాబెటిస్ వచ్చిన తరువాత శరీరంలో అనేక అవయవాలు పనితీరు మందగిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ఇది అనేక రకాల ప్రమాదాలకు కారణం అవుతుంది.

 అలాగే ఆహారం అధికంగా తీసుకోవడం వలన శరీరానికి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా చేరి అది రక్తంలో కలవడం వలన కూడా డయాబెటిస్ ఉన్నవారికి షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత ఆహారంలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. డయాబెటిస్ ఉన్నవారు మూడు పూటలా ఉడికించిన ఆహారం తీసుకోవడం అంత మంచిది కాదు. ఇలా తీసుకోవడం వలన శరీరానికి ఉప్పు, కారాలు ఎక్కువగా చేరి జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడుతుంది. సాయంత్రం ఆరు, ఏడు గంటలలోపు ఆహారాన్ని ముగించడం చాలా మంచిది. డయాబెటిస్ వచ్చిన తరువాత అందరూ పుల్కాలు, చపాతీలు తినడం అలవాటు చేసుకుంటారు. ఇవి అన్నానికి బదులు తినడం వలన కొంతలోకొంత ఆరోగ్యానికి మంచిదే అయినా వీటికంటే డ్రై నట్స్ తీసుకోవడం షుగర్ వున్న వారికి ఇంకా మంచిది. 

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి గింజలు మంచి చిరుతిండిగా ఉంటాయి. ఎందుకంటే అవి గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి, రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి మరియు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అయితే వీటిని సాయంత్రం తినేటప్పుడు ఉదయాన్నే నానబెట్టుకొని సాయంత్రం తినడం చాలా మంచిది. చాలామంది సాయంత్రం ఐదారు గంటలకు ఏదైనా స్నాక్స్ తింటుంటారు. దానికి బదులు డ్రై నట్స్, పండ్లు తినడం వలన నాలుగు సార్లు ఆహారం తినడం తగ్గుతుంది. ఎక్కువగా శారీరక శ్రమ లేని వారు ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు.

  త్వరగా ఆహారం తీసుకోవడం ముగించడం వల్ల ఆహారం బాగా జీర్ణమై మంచి నిద్ర, శరీర పనితీరు మెరుగుపడటం జరుగుతుంది. ఒక గుప్పెడు డ్రైనట్స్ తిన్న తర్వాత పండ్లలో ఏవైనా నాలుగు రకాలు అంటే ఒక యాపిల్, ఒక రెండు జామపండ్లు, ఐదారు రేగుపండ్లు వంటివి తీసుకొని కడుపునిండా తినాలి. ఇవి కడుపునిండుగా అనిపించి శరీరానికి కావలసిన శక్తిని పుష్కలంగా అందిస్తాయి. వీటి వలన తక్కువ షుగర్ శరీరానికి అందుతుంది. ఎన్నో విటమిన్లు, ఖనిజాలు శరీరానికి చేరతాయి.

Leave a Comment

error: Content is protected !!