Best Health Benefits of Fennel seeds

ఒంపు సొంపుల సొంపు

సాధారణంగా సుపారిల్లోనూ, రెస్టారెంట్లలో భోజనం తరువాత ఇష్టం గా తినే పదార్థం సోపు. దీన్నే సాధారణ వాడుకలో సోంప్ అంటున్నాం. అయితే కేవలం రుచిని ఇస్తూ మంచి సువాసన కలిగించడం తో పాటు ఈ సోంప్ లో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయ్. ఆ ఔషధ గుణాలు ప్రభావం తో ఎన్నో జబ్బులను నయం చేసే ఒక చిన్నపాటి డాక్టరమ్మ మన వంపు సొంపుల సొంపమ్మ. మీకు నమ్మకం లేకపోతే ఇదిగో చందవండి వరుసగా చెబుతానేం.

సోంప్ తో వివిధరకాల సమస్యలకు వైద్యం

 పిల్లలలో అజీర్ణ సమస్యకు 

సోంప్ ను నీళ్లలో వేసి మరిగించి కషాయము తయారు చేసుకుని, పిల్లల వయసు ను బట్టి ఒక స్పూన్ లేక రెండు స్పూన్ ల మోతాదు లో తాగించాలి. దీనివల్ల పిల్లల్లో అజీర్తి సమస్య పోయి పిల్లలు ఉత్సాహంగా ఉంటారు.

 గుండె నొప్పికి

విలవిలలాడిపోయే గుండె నొప్పికి  సోంప్ ఏం పని చేస్తుంది అని అంత తక్కువ చేయకండి. శొంఠి, సోంప్ గింజలు మంచినీళ్లతో నూరి రసం తీసి వడపోసి ఆ రసం లో కొంచం తేనె, కొద్దిగా పటిక బెల్లం కలిపి తాగుతూ ఉంటే గుండె నొప్పి తగ్గుతుంది. 

మెదడు బలానికి

మెదడు బలానికి సోంపా… అనుకోకండి. సోంప్ ఏ. 5 గ్రాముల సోంప్ గింజలను ఉదయం సాయంత్రం వేళల్లో తింటూ ఉంటే మెదడుకు బలం కలుగుతుంది. అయితే సోంప్ గింజలను దంచి, పొట్టు తీసి, శుభ్రం చేసుకుని వాడుకోవాలి.

వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి

మనకు వచ్చే జబ్బులకు వైద్యంగా సోంప్ ను వాడుకోవడమే కాదండోయ్ మన శరీరం లో రోగనిరోధక శక్తిని పెంచి ఎలాంటి మొండి జబ్బులకు మన శరీరం లొంగకుండా మన దేహంలో అవయవాల పనితీరును పటిష్టం చేసే శక్తి మన సోంప్ సొంతం.  వ్యాధినిరోధక శక్తి పెరగడానికి  సోంప్ గింజలను కొంచెం దోరగా వేయించి చూర్ణం చేసుకోవాలి. చూర్ణం అంటే అదేనండి పొడి చేసుకోవాలి. ఆ తరువాత ఈ చూర్ణాన్ని పూటకు మూడు గ్రాములంత తేనెతో కానీ, పటికబెల్లం తో కానీ, పంచదారతో కానీ కలిపి రోజులో రెండు పూటలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, మన శరీరం ఆరోగ్యవంతంగా అవుతుంది. ఎలాంటి రోగాలు మనల్ని టచ్ చేయలేవు.

 విన్నారా మరి మన బుల్లి డాక్టరమ్మ పనితనం. అందరూ ఫాలో అయిపోండి.

ఈ విధంగా సోంప్ గింజలను రోజు వారీ జీవితంలో భాగం చేసుకోవడం వల్ల శరీరాన్ని కబళించే వాత, పిత్త, కఫ అనే  త్రిదోషాలను పోగొట్టగలవు. అంతే కాదు సోంప్ తినడం వల్ల జ్వరం, కడుపునొప్పి, కడుపులో వికారం, అతిదాహం మొదలైన సమస్యలతో పాటు కళ్లకు సంబంధించిన సమస్యలను, అతిసారాన్ని నిర్మూలిస్తాయ్. అయితే అతి ఏదైనా అనర్థకమే అని అందరికి తెలిసిందే కదా. సోంప్ ను ఎక్కువ తినడం వల్ల అజీర్తి సమస్యలు ఎదురుకావచ్చు అందుకే దానికి కూడా పరిష్కారం చకచకా చెప్పేస్తా….. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండెం.

చివరిగా …

 అతిగా సోంప్ తినడం వల్ల వచ్చే అజీర్తిని నిర్మూలించడానికి  రాత్రి పడుకునే ముందు పావు గ్లాస్ వేడి నీటిలో పిల్లలకు అయితే అర టీ స్పూన్, పెద్దలకు అయితే ఒక టీ స్పూన్ త్రిఫలచూర్ణం ను కలిపి తాగడం వల్ల మలబద్దకం సమస్య మాయమవుతుంది.

       సోంప్ ను రోజువారీ జీవితంలో సంతోషంగా వాడేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!