Best Health Tips For Pus Boils in Telugu

వేడి సెగగడ్డలు, గుల్లలు రాకుండా ఈ చిట్కాలు పాటించండి.

కొంతమందికి  చర్మంమీద అక్కడక్కడా గుల్లలు వస్తాయి. చిన్న బఠాణి గింజలంత గడ్డలు కురుపుల్లా ఉంటాయి. ఇలాంటి గుల్లలు వస్తే వీటిని వేడి కురుపులు అంటారు. అది కొంచెం ఎర్రగా మారి నొప్పి వస్తాయి. కొన్ని రోజులకు అక్కడ తగ్గి ఇంకో చోట వస్తుంటాయి. అవి రెండు, మూడు నెలలకు మచ్చలు తగ్గి మళ్ళీ వస్తుంటాయి. ఇవి ఎక్కువగా పిరుదులు మీద, వీపు మీద, ముఖంమీద వస్తుంటాయి. ఇలాంటి గుల్లలు వేడిచేస్తే వస్తుంటాయి అంటారు. నిజానికి వేడి చేస్తుందా. 

పూర్వం నుండి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని పచ్చళ్ళు, మసాలాలు తింటే వేడిచేస్తుందని అనేవారు. నిజానికి అలా చెప్తే వింటారని మాత్రమే. అది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, గుల్లల్లో ఉండే చీము బయటకు రావడానికి అలా గడ్డల్లా తయారవుతుంది. కానీ వేడివలన కాదు. ఇలా సెగకురుపులు లేదా చర్మంపై ఏర్పడే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి రోజూ హనీ, లెమన్ వాటర్ రోజుకు ఐదారు సార్లు తాగాలి. నాలుగయిదు స్పూన్ల తేనె, అరచెక్క నిమ్మరసం కలపాలి. 

,రోజుకు నాలుగు లీటర్ల మంచినీళ్ళు తాగుతూ ఉంటే శరీరంలో ఉన్న టాక్సిన్లు, విషవ్యర్థాలు బయటకు పోతాయి. తేనె తాగడం వలన వేడి చేయదు. నీళ్ళు తాగకపోవడం వలన ఏర్పడే ఇబ్బంది అది. రోజుకు రెండు బోండాలు కొబ్బరినీళ్ళు తాగొచ్చు. జ్యూస్లు, కూరగాలరసాలన్నీ ఎక్కువగా తీసుకోండి. అలా చేయడం వలన రక్తశుద్ధి జరిగి బాక్టీరియా ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉళ్న పండ్లు తీసుకోవడం వలన బాక్టీరియా తగ్గుతుంది. రోజూ మంచినీళ్ళు రోజుకు ఐదారు లీటర్లు తాగాలి. 

పాతవి తగ్గి కొత్తగా రాకుండా చేస్తాయి. రోజుకు రెండు సార్లు విరోచనం అయ్యేలా చేస్తుంది. ఉదయాన్నే ఒక జ్యూస్ తప్పకుండా తాగండి. ఒక వెజిటబుల్ జ్యూస్, సాయంత్రం ఒక పళ్శ రసం త్రాగాలి. త్వరగా ఆహారం తీసుకోవాలి. టాక్సిన్లు బయటకు పోవడంవలన సెగకురుపులు రాకుండా ఉంటాయి. ఇలా రెండు మూడు నెలలు చేస్తే ఆరోగ్యం తోపాటు సెగగడ్డలు, కురుపులు కూడా తగ్గుతాయి. రక్తశుద్ధి జరగడం వలన ముఖంలో కాంతి పెరిగి ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. నొప్పులను కలిగించే సెగగడ్డలు ఏర్పడకుండా ఈ వేసవి నుండి రక్షించుకుందాం. 

మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

Leave a Comment

error: Content is protected !!