హలో ఫ్రెండ్స్ దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా..! అయితే డాక్టర్ తో అవసరం లేకుండా ఈ వంటింటి చిట్కాలు పాటించి కేవలం గంట లోపే తీవ్రంగా బాధిస్తున్న దగ్గు నుండి ఉపశమనం పొందండి. దగ్గు ముఖ్యంగా మూడు రకాలుగా వస్తుంది కఫంతో కూడిన దగ్గు, కఫం లేకుండా వచ్చే పొడి దగ్గు మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దగ్గు. ఒక్కో రకమైన దగ్గుకు ఒక్కో రకమైన చిట్కాలు పాటించడం వలన తగ్గించుకోవచ్చు.

పొడి దగ్గు ఇబ్బంది పెడుతూ ఉంటే కరక్కాయ పగలగొట్టి ఆ ముక్క బుగ్గన పెట్టుకుని రసం పీల్చు తూ ఉంటే సాధారణంగా వచ్చే పొడి దగ్గు తగ్గిపోతుంది. అలాగే పడుకునే ముందు గోరువెచ్చటి పాలలో పసుపు కలుపుకుని తాగినా చక్కటి రిలీఫ్ వస్తుంది.
దగ్గుతోపాటు ఆయాసం కూడా వస్తుంటే అల్లం రసంతో తేనె కలిపి ఉదయం సాయంత్రం తాగుతూ ఉంటే మంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలుపుకొని కొద్దికొద్దిగా సిప్ చేస్తూ తాగుతూ ఉంటే పొడి దగ్గు తగ్గుతుంది.

కఫంతో కూడిన దగ్గు ఇబ్బంది పెడుతూ ఉంటే నీటిలో యాలుకల పొడి, లవంగాల పొడి, రెండు తమలపాకులు వేసి మరిగించి కషాయం కాచుకుని వడగట్టి తాగితే కఫం తో కూడిన దగ్గు తగ్గుతుంది.
పరగడుపున తులసి ఆకులతో కొంచెం తేనె కలుపుకొని నమిలిన చక్కటి ఫలితం ఉంటుంది. వేప పుల్లతో పళ్ళు తోమిన కఫం బయటకు వచ్చేసి దగ్గు తగ్గిపోతుంది.
దగ్గుతోపాటు నస ఇబ్బంది పెడుతూ ఉంటే పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని కొంచెం కొంచంగా తాగుతూ ఉంటే నస తో కూడిన దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.
సొంటి కషాయంతో కొంచెం పటికబెల్లం పొడి కలిపి తాగినా దగ్గు తగ్గుతుంది. జలుబు దగ్గు వేధిస్తున్నప్పుడు వేడి పాలల్లో మిరియాల పొడి కలుపుకుని తాగితే జలుబు దగ్గు తగ్గుతాయి.
అసిడిటీ వల్ల కూడా దగ్గు వస్తుంది. అలాంటప్పుడు జీలకర్రను నమిలి రసం మింగితే వెంటనే అలా వచ్చే దగ్గు తగ్గుతుంది. సాధారణంగా దగ్గు వారం లోపల తగ్గిపోతుంది అలాకాకుండా పదిరోజుల పైబడి వస్తూ ఉంటే రద్దు చేయకుండా డాక్టర్ను సంప్రదించండి తగు చికిత్స చేయించుకోవాలి లేకపోతే క్షయ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది