Best Home Remedies for Hair Growth

మీరు ఏ షాంపూ వాడినా పర్వాలేదు, దీనిని కలిపి వాడితే జుట్టు పది రేట్లు విపరీతంగా పెరుగుతుంది

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. దానికి కారణం వాతావరణంలో కాలుష్యం, అనారోగ్యం కారణాలు, జుట్టు కావలసిన పోషకాలు అందకపోవడం.   జుట్టు రాలడం తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్, షాంపూలను ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటివి  ఉపయోగించాల్సిన అవసరం లేకుండా మీరు వాడే షాంపూలో ఇది ఒక్కటి కలిపి రాస్తే మీ జుట్టు విపరీతంగా పెరుగుతుంది. వాటిలో మొదటి చిట్కా దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాసు నీళ్లు వేసుకోవాలి. 

     స్టవ్ ఆన్ చేసి రెండు చెంచాల టీ పొడి వేసుకోవాలి. టీ పొడి వద్దనుకున్నవారు కాఫీ పౌడర్ ను కూడా వేసుకోవచ్చు.  2 నిమిషాలు పాటు  మరిగించుకోవాలి. తర్వాత నాలుగు మందార ఆకులను తీసుకొని వాటిని విడదీసి వేసుకోవాలి. నాలుగు లేదా ఐదు మందార ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.   వీటన్నిటిని కలిపి రంగు మారే వరకు మరిగించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత చల్లార్చుకోవాలి. చల్లారిన  తర్వాత స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోవాలి. 

     వడపోసుకున్న  నీటిని ఏదైనా  గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ బాటిల్ లో ఒకేసారి ఎక్కువగా తయారు చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు.   తలస్నానం చేసేటప్పుడు ఈ నీటిలో మనం ప్రతిరోజు ఉయోగించే షాంపూ కలుపుకొని  తల స్నానం చేయాలి. ఇలా వారం పది రోజులు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఎటువంటి హెయిర్ ప్యాక్స్  పెట్టుకోకపోయిన ఎటువంటి హెయిర్ ఆయిల్స్  ఉపయోగించకపోయిన  సరే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. 

      రెండవ  చిట్కా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. తర్వాత దానిలో రెండు చెంచాల మెంతులు వేసుకోవాలి. మెంతులు జుట్టు రాలడం తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత నాలుగు లేదా ఐదు   మందార ఆకులను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్  చేసి వేసుకోవాలి.  10 నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లార  పెట్టుకోవాలి. నీటిని వడకట్టుకుని  దానిలో షాంపూ కలుపుకుని   ప్రతి రోజూ తలస్నానం చేయాలి. ఇలా  చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. 

      మీకు అవసరం అనిపిస్తే రెండిటిలో ఏదో ఒకటి ట్రై చేయండి. రెండు చేయాల్సిన అవసరం లేదు. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

Leave a Comment

error: Content is protected !!