ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు తెల్ల వెంట్రుకలు సమస్యతో బాధపడుతున్నారు. అతి చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు రావడం వల్ల నలుగురిలో తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అందుకోసం మార్కెట్లో దొరికే అనేక రకాల హెయిర్ డైస్ ఉపయోగిస్తున్నారు. ఈ హెయిర్ డైస్ అనేక రకాల కెమికల్స్ కలిగి ఉండడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ఏమి ఉపయోగించకుండా, ఎటువంటి కెమికల్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే మీ జుట్టు నేచురల్ గా నల్లగా మార్చుకోవచ్చు.
ఈ రెమిడీ ట్రై చేసిన తర్వాత మీకు తెల్లవెంట్రుకలు అసలు కనిపించవు. దీని కోసం ముందుగా కరివేపాకులు తీసుకుని శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరనివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇనుప కడాయి పెట్టుకుని కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. నూనె వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు నల్లగా మాడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న పౌడరు ఒక గిన్నెలో వేసుకుని దానిలో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవాలి.
తర్వాత దీనిలో ఒక చెంచా అలోవెరా జెల్ వేసుకోవాలి. దీనిలో ఒక చెంచా కొబ్బరినూనె కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల స్నానం చేసిన జుట్టుకు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత గంట వరకు ఆరనివ్వాలి. ఇది బాగా గట్టిగా ఆరిపోకుండా కొంచెం తడిగా ఉన్నప్పుడే నీటితో కడిగేసుకోవాలి. అప్లై చేసిన రోజు షాంపూ ఉపయోగించకూడదు. మరుసటి రోజు షాంపూ యూస్ చేయొచ్చు. ఇలా వారానికి ఒక సారి చేయాలి. ఇలా ఒక నెలపాటు చేయడం వలన తెల్ల వెంట్రుకల మొత్తం నల్లగా మారిపోతాయి.
ఈ చిట్కాలు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారూ ఉపయోగించుకోవచ్చు. ఆడవారు మరియు మగవారికి కూడా ఈ చిట్కా చాలా బాగా పని చేస్తుంది. దీనిలో ఎటువంటి కెమికల్స్ ఉపయోగించలేదు. కాబట్టి దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ ప్యాక్ ట్రై చేసిన తరువాత అసలు తెల్ల వెంట్రుకలు కనిపించవు. మీకు కూడా అవసరం అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ ఉంటుంది.