శరరంలో చేరిన మలినాలను శుభ్రపరిచే క్రమంలో శరీరం మూత్రం, మలం రూపంలో బయటకు పంపిస్తుంది. దానికి కావలసిన నీటిని మనం తాగకపోవడం, అవసరమైనప్పుడు మూత్ర విసర్జన చేయకపోవడం, పబ్లిక్ టాయిలెట్స్ వాడడం, అనేక రకాల మందులు వాడడం, వేళాపాళాకాని ఆహారపుఅలవాట్లు, దూరపు ప్రయాణాలు వలన మూత్రాశయ ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి. అంతేకాకుండా గర్భవతుల్లో, మూత్రపిండాల్లో రాళ్ళు సమస్యలు వలన పురుషుల్లో కూడా ఈ సమస్య కనపడుతుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
దీనివలన పొత్తికడుపులో నొప్పి, మూత్రంలో మంట, నొప్పి, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళాల్సి రావడం, మూత్రం రంగు మారి ఎరుపు, పసుపు రంగుల్లో ఉండడం వలన ఇబ్బందులకు గురవుతాం. దీనివలన నీరసం, జ్వరం రావడం జరుగుతుంది. దీనిని తగ్గించేందుకు మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ నేను చెప్పే చిట్కాని ఉపయోగించడం వలన మూత్రంలో ఇన్ఫెక్షన్ నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
దీనికి కావలసిన పదార్థాలు. ఒక స్పూన్ ధనియాలు పొడి, ఒక స్పూన్ పటికబెల్లం(మిస్రీ), పావుస్పూన్ ఉప్పు అరకప్పు నీటిలో వేసి పదినుండి, పదిహేను నిమిషాలు మరిగించి చల్లారాక రోజుకి మూడుసార్లుగా తీసుకుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది. దీనిని తాగడంవలన ఒక్కరోజులోనే మంచి ఫలితాలు ఉంటాయి. మూత్రం వెంట వెంటనే రావడం ఆగిపోయి మంట, నొప్పి తగ్గిస్తుంది. ధనియాలుకి ఆయుర్వేదం ప్రకారం శరీరంలో వేడిని తగ్గించి చలవచేసే గుణం ఉంది. పటికబెల్లం కూడా శరీరంలో వేడిని తగ్గిస్తుంది. రోజులో మూడుసార్లు తాగడంవలన మూత్రంతోపాటు ఇన్ఫెక్షన్ కూడా బయటకు పోతుంది.
అలాగే కిడ్నీలలోని రాళ్ళుకూడా కరిగిపోతాయి. ధనియాలు కషాయంతో పాటు రోజుకి మూడు నుండి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. సబ్జాగింజలనీళ్ళు, కొబ్బరినీళ్ళు తాగడం , పలుచని మజ్జిగ ఎక్కువగా తాగడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆహారంలో మసాలాలు, మాంసాహారం, నూనెలు తగ్గించి తినడం మంచిది. పరిశుభ్రత పాటించడం, సాత్విక ఆహారం వలన కూడా మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందొచ్చు. ఆహారంలో నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు భాగం చేసుకోవడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.