ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఆహారపు అలవాట్లు అనారోగ్య సమస్యల వల్ల జుట్టు రాలడం తగ్గి చాలా ఎక్కువగా ఉంది. జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి రకరకాల హెయిర్ ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ మార్కెట్లో దొరికే ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ ఉపయోగించడం వలన వాటిలో కెమికల్స్ ఉంటాయి. కాబట్టి వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అలా కాకుండా ఇంట్లో ఉండే వాటితోనే ట్రై చేయడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆయిల్ ను తయారు చేసుకొని ఒక వారం ఉపయోగించినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. జుట్టు రాలడం చాలా ఎక్కువగా ఉన్న వాళ్లకి కూడా వెంటనే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. దీనికోసం ముందుగా ఉల్లిపాయ పొట్టు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనికోసం నాలుగు ఉల్లిపాయలు పొట్టును తీసుకుంటే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఎక్కువగా ఒకేసారి మిక్సీ పట్టుకొని గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు.
ఉల్లిపాయలు సల్ఫర్ అధికంగా కలిగి ఉంటాయి. కాబట్టి జుట్టు రాలడం తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయి. తర్వాత 4 రెమ్మలు కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు బీటా కెరోటిన్ అధికంగా కలిగి ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మూడు వంతుల కొబ్బరి నూనె, ఒక వంతు ఆవ నూనె తీసుకోవాలి. వీటన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం నీళ్ళు వేసి డబల్ బాయిలర్ పద్ధతిలో నూనె వేడి చేసుకోవాలి.
తర్వాత నూనె వడ కట్టుకోవాలి. ఈ నూనె వడకట్టుకోకుండా అలా రాసుకోవడం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఈ నూనెను వారానికి రెండు లేదా మూడు సార్లు రాయడం మొదలు పెట్టేసరికి జుట్టు రాలడం తగ్గి చిన్న చిన్న వెంట్రుకలు రావడం మొదలవుతుంది. మీకు జుట్టు రాలడం ఎంత ఎక్కువగా ఉన్నా సరే ఈ నూనె రాసే సరికి వెంటనే తగ్గుతుంది. మనం తలకు రాసుకునే నూనెను రెగ్యులర్గా ఒకటి ఉపయోగించకుండా మధ్యమధ్యలో మారుస్తూ ఉండాలి.
అలా చేయడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది. జుట్టురాలడం సమస్యతో బాధపడే వారు ఒకసారి ఈ నూనెను ఉపయోగించి చూడండి జుట్టు రాలడం వెంటనే తగ్గిపోతాయి. కొత్త జుట్టు వస్తుంది. అంతేకాకుండా ఈ నూనెను ఉపయోగించడం వలన జుట్టు ఫ్రీజీ గా ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది. జుట్టు స్మూత్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ నూనె అన్ని వయసులవారు ఉపయోగించవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.