Best Juice for White Discharge Reduces Yeast Infections

దీన్ని పదిరోజులు తాగితే స్పీడ్గా పదికేజీల బరువు తగ్గుతారు. పీరియడ్స్ సమస్యలు తొలగిపోతాయి

స్త్రీలలో వైట్ డిశ్చార్జ్  ఎక్కువగా అవడం, దుర్వాసన, రంగు మారడం వంటివి ఉన్నప్పుడు ఏం చేయాలి? అది ఎందువలన వస్తుందో తెలుసుకుందాం. స్త్రీలలో అండం విడుదలవడానికి ముందు తెల్లబట్ట సహజంగా ఎక్కువ అవుతుంది. ఇది సమస్య కాదు. కానీ లోదుస్తులకు అంటుకుని మరక అవ్వడం, దుర్వాసన వస్తున్నప్పుడు , రంగు మారి ముద్దలుగా అవుతున్నపుడు సమస్యగా పరిగణించాలి. 

జననేంద్రియం దగ్గర ఈస్ట్ లేదా బాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్కి గురైనపుడు ఇలాంటి సూచనలు కనిపిస్తాయి. అప్పుడు డాక్టర్లని సంప్రదించి మందులు వాడడం మంచిది. అలాగే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు కూడా ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో చాలా బాగా సహకరిస్తాయి. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కేవలం రస ఉపవాసం మాత్రం చేయాలి. 

అంటే ఉదయాన్ని ఒక వెజిటేబుల్ జ్యూస్, తర్వాత 11 గంటలకు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్, ఒంటి గంటన్నర సమయంలో ఒక బత్తాయి రసం లేదా దానిమ్మరసం ఏదో ఒకటి తీసుకోవాలి. మళ్ళీ నాలుగు గంటలకు ఒక వెజిటేబుల్ జ్యూస్ సాయంత్రం ఏడు గంటలకు పైనాపిల్ జ్యూస్ మాత్రమే తీసుకుంటూ ఆహారాన్ని తీసుకోకుండా ఉండడాన్ని రస ఉపవాసం ఉంటారు.

 ఇలా కనీసం రెండు, మూడు రోజులు తీసుకోవడం వలన శరీరంలో పేరుకున్న విషపదార్థాలు బయటకు వెళ్ళిపోవడంతో పాటు పి హెచ్ లెవెల్ నియంత్రణలో ఉంటుంది. సహజంగా ఇన్ఫెక్షన్స్ తగ్గడంతోపాటు మంచి ఆరోగ్యం వస్తుంది. ఇలా రస ఉపవాసం చేసిన తర్వాత రెండు రోజులు ఫల ఉపవాసం చేయాలి అంటే ఉదయం, సాయంత్రం, మద్యాహ్నం కేవలం పండ్లు మాత్రమే తీసుకుంటూ గడపాలి. 

ఇలా చేయడం వల్ల సహజంగా ఇన్ఫెక్షన్స్ తగ్గడం మీరు గమనిస్తారు. అంతేకాకుండా ఈజీగా బరువు తగ్గుతారు. 

తర్వాత కొన్ని వేపాకులను నీటిలో మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు మూత్రానికి వెళ్లిన ప్రతిసారి జననేంద్రియాన్ని శుభ్రపరుచుకోవడానికి ఉపయోగించడం, స్వచ్ఛమైన తేనె దొరికితే రెండు వేళ్ళతో జననేంద్రియం లోపల పూయడం వలన కూడా అ ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతాయి. డాక్టర్ దగ్గర మందులు వాడుతూ ఈ చిట్కాలను పాటించడం వలన కూడా త్వరగా ఈస్ట్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు.

Leave a Comment

error: Content is protected !!