Best Leaf for Hair Growth Get Thick and Long Hair

జుట్టు ఊడదు, పలచ బడదు…… ఊడిన చోట ఈ పేస్ట్ రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది…

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఆడ మగ అనే బేధం లేకుండా జుట్టు అనేది అందరికీ ఊడిపోతుంది. జుట్టు నల్లగా ఉండాలి, ఊడకుండా ఉండాలి ఊడిన చోట కొత్త జుట్టు స్పీడుగా రావాలి, తలలో చుండ్రు రాకూడదు, దురదలు ఇరిటేషన్ రాకుండా షైనిగా జుట్టు ఉండాలి అనుకుంటున్నారా, ఇలాంటి కోరికలు తీర్చడానికి న్యాచురల్ ఆకు ఏదైనా ఉంది అంటే, అది ఆయుర్వేద శాస్త్రం మనకు అందించిన బృంగరాజ్ లీవ్స్. దీనిని తెలుగులో గుంటగరగరాకు అని అంటారు. ఈ లీవ్స్ ని ఉపయోగించి జుట్టు సమస్యలన్నీ పరిష్కరించవచ్చు.  

                జుట్టుకి బృంగరాజ్ లీవ్స్ ఉపయోగించడం ద్వారా ఆరు లాభాలు ఉన్నాయి. మొదటి లాభం జుట్టు ఎక్కువ నల్లగా ఉండటానికి ఉపయోగపడుతుంది. జుట్టు కుదుళ్లలో ఉండే మెలనోసైట్స్ డ్యామేజ్ అయ్యి నలుపు వర్ణాన్ని తక్కువ ఉత్పత్తి చేస్తాయి. అలాంటి వాటిని రిపేర్ చేయడం మరియు స్టిమ్యులెట్ చేయడం ఈ రెండు పనులను  బృంగరాజ్ లీవ్స్  చేస్తాయి. కాబట్టి దీని ద్వారా మెలనిన్ అనే నలుపు వర్ణం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల జుట్టు నల్లగా మారుతుంది. రెండవ లాభం చూసుకుంటే ఇందులో ఉండే కొన్ని సైటో కెమికల్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఎక్కువ ఉండడం వల్ల జుట్టు కుదుళ్ల నుండే జుట్టు ఎదుగుతుందని స్పీడుగా చేసి తక్కువ సమయంలో బాగా పొడవు అయ్యేలా చేస్తుంది. 

                  కెరోటన్ అనే ప్రోటీన్స్ నీ ఆక్టివేట్ చేసి జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడతాయి. మూడవ లాభం ఊడిన వెంట్రుకలు తక్కువ టైంలోనే తిరిగి కొత్త వెంట్రుకలు రావడానికి ఈ బృంగరాజ్ లీవ్స్ ఉపయోగపడతాయి. నాలుగవ లాభం కొలజిన్ ప్రొడక్షన్ మాడు మీద బాగా పెంచడానికి ఉపయోగపడుతుంది. ఐదవ లాభం ఈ ఆకులలో విటమిన్ ఇ అనేది జుట్టుకుదుల్లని బలపరిచి జుట్టు ఊడకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. ఆరవది మాడు భాగంలో చుండ్రు రాకుండా ఎంట్రీ డాండ్రఫ్ గా ఉపయోగపడుతుంది. ఈ ఆరు రకాల లాభాలు ఇచ్చే ఈ బృంగరాజ్ లీవ్స్ ఎలా వాడుకోవచ్చు అంటే ఆకులను తీసుకొచ్చి పేస్టులా చేసి ఫిల్టర్ చేసి జ్యూస్ తీసుకోవాలి.

                 ఈ ప్యూర్ జ్యూస్ ని నువ్వుల నూనెతో కలిపి మరిగించి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పోసి నిల్వ ఉంచుకోవాలి. దీనిని తరచుగా తలకు అప్లై చేసుకోవాలి. లేదా ఈ ఆకులను పేస్ట్ లా చేసి మాడుకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా మారి నిగనిగలాడుతూ ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!