best medicine for diabetes without side effects

షుగర్ కు విడాకులు ఇచ్చే మందు. ఒక్కసారి ట్రై చేస్తే జీవితంలో మళ్ళీ రాదు

షుగర్ వ్యాధి ఒకసారి వచ్చిందంటే జీవితంలో దానిని తగ్గించుకోవడం కష్టం. జీవితాంతం మందులు వేసుకోవాలి అని స్పెషలిస్టులు చెబుతుంటారు. ఎందుకంటే వారు అందులో స్పెషలైజేషన్ చేసి ఉంటారు కనుక మనం కూడా నమ్మాలి. కానీ మన ఆయుర్వేదం ప్రకారం మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటే షుగర్ ని తగ్గించుకోవచ్చు మరియు జీవితంలో రాకుండా చేసుకోవచ్చని చెబుతున్నారు. దాని కోసం మనం రక్తంలో షుగర్ కలవకుండా చేసే ఆహారాలు తీసుకోవడం ద్వారా షుగర్ వ్యాధి నుండి దూరంగా ఉండవచ్చు. మనం తినే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్లు షుగర్గా మారుతాయి. మనం తినే ఆహారంలో ద్వారా వచ్చే షుగర్ రక్తంలో కలిసి షుగర్ వ్యాధిని పెంచుతుంది. 

అందుకే మనం టిఫిన్ తినే ముందు ఒక టాబ్లెట్ వేసుకోమని డాక్టర్లు చెబుతారు. టాబ్లెట్ వేసుకొని షుగర్ పెరిగే ఆహారాన్ని తిని దాన్ని తగ్గించుకునే కన్నా షుగర్ పెరగకుండా ఆహారం తినడం నేర్చుకోవాలి. కొన్ని ఆహారాల ద్వారా మనం షుగర్ రాకుండా అడ్డుకోవచ్చు. వచ్చినా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. తల్లిదండ్రులకు ఉన్నా కూడా మనకు రాకుండా జాగ్రత్త పడవచ్చు. చక్కెరలను పెంచని ఆహారాలు లేవా అంటే ఉన్నాయి  అనేదే సమాధానం. మనం తినే ఆహారాలలో ఉదయాన్నే అల్పాహారంగా ఇడ్లీ ఎక్కువగా తింటూ ఉంటాం. ఇడ్లీ వలన, దోశ వంటి వాటి వలన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా మన శరీరంలోకి వెళ్తాయి. ఇవి చక్కెర స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి.

 అంతేకాకుండా మనం మధ్యాహ్నం ఆహారంగా తీసుకునే అన్నంలో కూడా 77 శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మళ్లీ రాత్రి ఆహారంగా టిఫిన్లు లేదా అన్నం చపాతీ వంటివి తీసుకుంటాం. వీటివల్ల కూడా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా మన శరీరంలో చేరుతాయి. ఎక్కువగా కార్బోహైడ్రేట్లు తీసుకొని మళ్ళీ వాటిని తగ్గడానికి టాబ్లెట్లు వేసుకొనే బదులు ఆహారంలో మార్పులు చేసుకోవడం వలన అసలు కార్బోహైడ్రేట్లు శాతాన్ని తగ్గించుకోవచ్చు. దానికోసం కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అన్నాన్ని తక్కువగా తీసుకొని కూరలు ఎక్కువగా తీసుకోండి. దీనివల్ల శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. 

అలాగే సాయంత్రం వీలైనంత తొందరగా కడుపు నిండా పండ్లను తీసుకోవచ్చు. దానితోపాటు ఎండుగింజలను కూడా ఆహారంలో తీసుకోవచ్చు. ఇవి షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో మనకు చాలా బాగా సహాయపడుతాయి. ఇలా ఆహారంలో మార్పులు చేసుకుంటూ షుగర్ ను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. వీలైనంత కార్బోహైడ్రేట్లు దూరంగా ఉంటే షుగర్ లెవెల్స్ పెరగడం కూడా ఆగిపోతుంది. ఈ ఆహారాలు, వ్యాయామం ఒత్తిడికి దూరంగా ఉండడం ద్వారా మన తల్లిదండ్రులకు డయాబెటిస్ ఉన్నా మనకు రాకుండా అడ్డుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!