Best medicine for hair fall and regrowth

చుండ్రు, పేలు నిముషాల్లో మాయం చేసే టిప్, పెచ్చులుగా కట్టిన చుండ్రు కూడా రాలిపోతుంది

ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి పిల్లలకి పేలు వచ్చేస్తాయి. పేలు మరియు చుండ్రు వలన దురద, జుట్టు రాలడం మొదలవుతుంది.  తలలో చుండ్రు తగ్గినట్లయితే జుట్టు రాలడం సమస్య  సగం తగ్గినట్లే.  మనం చుండ్రు మరియు పేలు  పోగొట్టే చిట్కా గురించి మనం తెలుసుకుందాం.  ఈ చిట్కా ట్రై చేసినట్లయితే పేలు, చుండ్రు పోవడమే కాకుండా జుట్టు రాలడం సమస్య కూడా బాగా తగ్గుతుంది.  దీనికోసం ముందుగా వేపాకులను తీసుకోవాలి.

       ఒక గుప్పెడు వేపాకులు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వేపాకు  యాంటీబయటిక్, యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయి. ఈ గుణాలను కలిగి ఉండటం వలన తలలో ఉండే చుండ్రు పేలు పోగొట్టడం కాకుండా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిని  కూడా తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.  వేపాకులు మునిగేంత వరకు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. 

            మరిగించిన నీటిని సగం స్ప్రే బాటిల్ లో వేసి హెయిర్ టానిక్ లాగా యూస్ చేసుకోవచ్చు.  ఈ వాటర్ తల స్నానం చేయడానికి ఒక గంట ముందు స్కాల్ప్ కి అప్లై చేసుకోవాలి. జుట్టు మొత్తం కాకుండా ముందు కుదుళ్లకు బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 5 నిముషాల పాటు మస్సాజ్ చేసుకోవాలి. ఈ వేపాకులు వేసిన నీళ్లు కుదుళ్లకు అప్లై చేయడం కుదుళ్ళు బలంగా తయారవుతాయి. తలలో ఉండే పేలు, చుండ్రు మరియు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి.

        ఇన్ఫెక్షన్స్, చుండ్రు తగ్గడం వలన జుట్టు రాలడం కూడా తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, బలంగా పెరుగుతుంది. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న వేపాకుల వేసి మరిగించిన నీటిలో మీరు రెగ్యులర్ గా వాడే షాంపూ వేసి బాగా కలుపుకోవాలి. ఈ నీటితో తలస్నానం చేసినట్లయితే ఇన్ఫెక్షన్స్, చుండ్రు, పేలు తగ్గిపోతాయి. తలలో ఉండే వీపులు కూడా చచ్చిపోతాయి. దురద, జుట్టురాలడం కూడా తగ్గుతుంది. వేపాకు యాంటీబయాటిక్ అధికంగా కలిగి ఉండటం వలన తలలో ఉండే ఇన్ఫెక్షన్ కలిగించే  వైరస్ తో పోరాడి ఇన్ఫెక్షన్ తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. 

      తలలో పేలు, చుండ్రు, ఇన్ఫెక్షన్, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ చిట్కా  ట్రై చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!