Best moral video kitchen Tips

బొద్దింకలు, బల్లులు పారిపోయే సింపుల్ చిట్కాలు…..

ప్రతి ఒక్కరి వంటింటిలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య చిన్న బొద్దింకలు, బొద్దింకలు, బల్లులు వీటివల్ల నాకు చాలా చిరాకు వస్తుంది. అంతేకాకుండా ఇవి మన ఇంటిని పాడు చేస్తూ ఉంటాయి. బొద్దింకలు రాకుండా ఉండాలి అంటే గాలి మరియు వెల్తురు ఎక్కువగా ఉండాలి. ఇలా ఉండే ప్రదేశాల్లో బొద్దింకలు జీవించలేవు.  ఇవి చెత్త పేరుకుపోయిన ప్రదేశాలలో బాగా ఎక్కువగా ఉంటాయి. అందువలన మనం చేయాల్సిన ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే మన ఇంటిని ఎప్పుడు నీట్ గా ఉంచుకోవాలి.

కిచెన్ లో ఎక్కువగా తలుపులు ఉండడం వలన చీకటి ఎక్కువగా ఉండి బొద్దింకలకు ఇష్టంగా ఉంటాయి. అంతేకాకుండా ఇవీ చెమ్మా ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంటాయి. చీకటి, తడి లేకుండా చేస్తే పెద్ద బొద్దింకలు మన ఇంట్లో ఉండవు. ఈ బొద్దింకలను సంహరించడానికి వేగన్స్ స్ప్రే వంటివి వాడుతూ ఉంటారు. ఇది ఘాటైన వాసనతో కుడి ఉంటుంది. ఇవి మన శరీరానికి కూడా పడవు. వీటి వలన మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. అందువలన ఇది అంత మంచి పద్ధతి కాదు. ఒకప్పుడు బొద్దింకలు వంటివి బయట ప్రదేశంలో ఉండేవి.

మొత్తం జీవరాశుల్లో ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని ఎటువంటి కెమికల్స్ అయిన తట్టుకొని వాటికి తగ్గట్టు మార్పు చేసుకునే జీవక్రియ బొద్దింకలు మరియు దోమలలో కనిపిస్తుంది. ఇప్పుడు ఇవి బ్రతకడానికి బయట చోటు లేదు కనుక మన ఇంటిలోకి వస్తున్నాయి. ఆ కారణంగా మనం చేయవలసినది ఏమీ లేదు. ఇవి ఎక్కువగా మోరీల నుంచి బయటకు వస్తాయి. అందువలన వాటిని నీటిగా ఉంచుకోవాలి. అందులో నేఫ్తాలీన్ బాల్స్ కూడా వేసుకోవచ్చు. ఇది బొద్దింకలను చంపావు గాని దాని యొక్క ఘాటైన వాసన వలన ఆ ప్రదేశంలో ఎక్కువసేపు ఉండలేవు.

చిన్న బొద్దింకలు అయితే ఏం చేసినా పోవు వీటికున్న ఒకే ఒక మార్గం ఇంటిని ఎప్పుడుకప్పుడు శుభ్రం చేసుకోవడం. మరియు ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయి అంటే దానికి కారణం ఇంట్లో దోమలు చిన్న చిన్న కీటకాలు, సాలె పురుగులు ఉన్నాయని అర్థం. కనుక ఇవి మన ఇంట్లో ప్రవేశించకుండా చూసుకోవాలి. ఇలా ఉండాలి అంటే ఇంటిని ఎప్పటికప్పుడు నీట్ గా ఉంచుకోవాలి. ఇది రాకుండా ఉండాలి అంటే రాకుండా ఉండాలనుకున్న ప్రదేశంలో గుడ్డు యొక్క గుళ్లను ఆ ప్రదేశంలో ఉంచుకోవాలి. ఈ పద్ధతులు పాటించడం ద్వారా మన ఇంటిలో బొద్దింకలు బల్లులు రాకుండా చూసుకోవచ్చు….  

Leave a Comment

error: Content is protected !!