మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు నొప్పి వలన చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరికి పెద్దగా శబ్దం వినిపించినా, సూర్యుని కాంతి ఎక్కువగా తగిలినా, ఏడ్చినా, నిద్ర సరిగ్గా లేకపోయినా ఈ తలనొప్పి అనేది బాగా వేధిస్తుంది. ఈ సమయంలో వాంతులు, వెలుతురు చూడలేకపోవడం, విపరీతమైన తలనొప్పితో బాధపడతారు. ఇలా మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు ఇప్పుడు చెప్పబోయే చిట్కా ఉపశమనం కలిగిస్తుంది.
దాని కోసం మనం లవంగాలు తీసుకోవాలి. లవంగాలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. అవి తమ శీతలీకరణ మరియు నొప్పిని తగ్గించే లక్షణాలతో తలనొప్పిని తగ్గించగలవు. కొన్ని లవంగాలను చూర్ణం చేసి శుభ్రమైన రుమాలులో ఉంచండి. మీకు తలనొప్పి వచ్చినప్పుడల్లా, నొప్పి నుండి కొంత ఉపశమనం పొందే వరకు లవంగాల చూర్ణం యొక్క వాసనను పీల్చుకోండి. అంతేకాకుండా లవంగాలను పొడిచేసి పక్కన పెట్టుకోండి. తలనొప్పి నివారణ కోసం ఎప్పటికప్పుడు లవంగాలను పొడి చేసి పెట్టుకోవడం మంచిది.
తర్వాత పదార్ధం సైంధవలవణం లేదా రాక్ సాల్ట్. దీనిని 4 లేదా 5 గుళికలు ఈ లవంగాలతో కలిపి మెత్తని పొడిలా చేసుకోవాలి. సైంధవ లవణం ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అనేక నివారణా చికిత్సల్లో సైంధవ లవణాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం మరియు ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది తలలో చేరిన అధిక ద్రవాలను పీల్చుకొని మైగ్రేన్ తలనొప్పి తగ్గడంలో సహాయపడుతుంది. కొన్నిసార్లు మీ మైగ్రేన్కి డీహైడ్రేషన్ కారణం అయితే మీరు ఎక్కువగా నీటిని తీసుకోవడం వల్ల తలనొప్పి సమస్య తగ్గుతుంది.
అలాగే ఆహారంలో చాక్లెట్లు వెన్న మాంసాహారం తగ్గించి ప్రోటీన్లు, మ్యాంగనీస్, విటమిన్ సి, డి, బీ12 ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం వలన తలనొప్పి సహజంగా తగ్గుతుంది. రోజులో కొంత సేపు ఎండ తగిలేలా కూర్చోవడం వలన విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. నిద్ర సరిగా లభించకపోవడం వలన కూడా మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. రోజులో కనీసం ఎనిమిది గంటలు నిద్ర తప్పనిసరి చేయడం వలన మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.