మానవ శరీరంలోని ప్రతి కణంలో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ యొక్క ప్రాథమిక నిర్మాణం అమైనో ఆమ్లాల గొలుసు. మీ శరీరం కణాలను రిపేర్ చేయడంలో మరియు కొత్త వాటిని తయారు చేయడంలో సహాయపడటానికి మీ ఆహారంలో ప్రోటీన్ అవసరం. పిల్లలు, టీనేజ్ మరియు గర్భిణీ స్త్రీలలో పెరుగుదల మరియు అభివృద్ధికి ప్రోటీన్ కూడా ముఖ్యమైనది. అయితే ప్రోటీన్ ను మనం వివిధ రకాల ప్రోడక్ట్, పౌడర్స్ నుండి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కానీ వీటన్నింటి కంటే మనకు సహజంగా దొరికే ప్రొటీన్ ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు ముఖ్యంగా పాలు, గుడ్లు నుండి ప్రొటీన్ లభిస్తుంది. వెజిటేరియన్ తినేవారికి పప్పులు నుండి కూడా ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. అయితే మనం నేచురల్ గా దొరికే ప్రోటీన్ ను నిర్లక్ష్యం చేసి మార్కెట్లో దొరికే పదార్థాలు వైపు మొగ్గు చూపుతున్నాం.
పాలు ఒక తల్లి నుండి బిడ్డ కోసం తయారు చేయబడిన పదార్థం. దీనిలో ఎక్కువ శాతం నీరు, ప్రొటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్ మన శరీరానికి సరిపోతుంది. పాల నుండి చీజ్ తయారు చేసే కొన్ని కంపెనీలు వాటి నుండి తీసేసిన నీటిని బయట పారేసేవారు. కానీ ఈ నీటిలో శరీరానికి కావలసిన whey ప్రొటీన్ లభిస్తుందని తెలిసిన తర్వాత దీనిపై పరిశోధనలు చేశారు. ఇది శరీరానికి కావలసిన ప్రొటీను పుష్కలంగా పౌడర్ రూపంలో అందిస్తుంది. కానీ ఇది ఇది ఖరీదైనది కనుక పాల ద్వారా కూడా తీసుకోవచ్చు. పాలు కేసైన్ మరియు పాలవిరుగుడు అనే రెండు ప్రోటీన్లతో తయారవుతాయి. పాలలోని కేసైన్ నుండి పాలవిరుగుడు ప్రోటీన్‌ను వేరు చేయవచ్చు లేదా చీజ్ తయారీలో ఉప ఉత్పత్తిగా ఏర్పడుతుంది. వెయ్ ప్రోటీన్ మొత్తం 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉన్నందున పూర్తి ప్రోటీన్‌గా పరిగణించబడుతుంది. ఇందులో లాక్టోస్ కంటెంట్ తక్కువగా ఉంటుంది.
వెజిటేరియన్ రోజుల్లో ఒక పూట అయినా పప్పుని ఆహారంగా తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ప్రొటీన్లు లభిస్తుంది. అలాగే గుడ్డులో 6-7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మీ శరీరాన్ని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవడానికి, పచ్చిగా కాకుండా ఉడికించిన గుడ్లను తినమని సిఫార్సు చేయబడింది. ఆకట్టుకునే ప్రోటీన్ కంటెంట్ పక్కన పెడితే, గుడ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి మరియు ముఖ్యంగా బరువు తగ్గడానికి అనుకూలంగా ఉంటాయి. దీనిలో ఉండే ప్రోటీన్స్ శరీరానికి సరిపోతుంది కనుక రోజూ ఒక గుడ్డును పసుపు భాగంతో సహా తినవచ్చు. బరువు పెరుగుతుందని భయపడనవసరం లేదు.