ప్రస్తుతం స్త్రీ, పురుషులు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ముఖంపై మొటిమలు మరియు మచ్చలు. ఇది ఆహారంలో ఆయిల్స్ ఎక్కువగా ఉండటం వలన, పొల్యూషన్ కారణంగా, వాతావరణం లోని బ్యాక్టీరియాల్ వలన ఈ సమస్యలతో అందరూ బాధపడుతున్నారు. వీటిని తొలగించుకోవడానికి ఎన్నో రకాల హోమ్ రెమెడీస్ మరియు కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్ ఉపయోగిస్తున్నారు. వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఎటువంటి ఫలితం ఉండటం లేదు. అంతేకాకుండా పార్లర్ చుట్టూ తిరుగుతూ ఖర్చు చేస్తున్నారు.
కానీ వాటి వలన కొంతకాలం మాత్రమే ప్రయోజనం ఉంటుంది. మరలా సమస్యలు తిరిగి వస్తున్నాయి. మొటిమలు మరియు వాటి వలన వచ్చే మచ్చలు తోలిగించుకోవడానికి ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే రెమిడి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉపయోగించేవాన్ని నేచురల్ గా లభించే పదార్థాలు కావున ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక దీనిని చిన్నవారి నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు ఉపయోగించవచ్చు. ఈ రెమిడి కోసం మనకు కావలసింది వేపాకులు. వేపాకులు మన అందరికీ తెలిసినవే.
ఇవి ఆంటీ బ్యాక్టీరియల్ మరియు ఆంటీ ఇన్ఫ్లామెటరీగా ఉంటాయి. ఈ వేపాకులను నాలుగైదు రోజులు ఎండబెట్టి వాటిని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ వేపాకుల పొడిని రోజ్ వాటర్ తో కలిపి ఒక పేస్టు లాగా తయారు చేసుకోవాలి. ఎలా తయారైన పేస్టు మన ముఖం పై ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన ఒక అరగంట తర్వాత ప్యాక్ మొత్తం డ్రై అవుతుంది. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా ఉపయోగించడం ద్వారా నెమ్మది నెమ్మదిగా మొటిమలు మరియు మొటిమలు తాలూకు మచ్చలు తగ్గుతాయి.
ఈ ప్యాక్ యొక్క ప్రభావం వెంటనే ఉండదు గానీ శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు వలన మొటిమలు ఉన్న ప్రదేశంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. మరియు మచ్చలను కూడా క్రమంగా తగ్గించడంలో ఒక వేపాకు సహాయపడుతుంది. ఇందులో ఉపయోగించే రోజు వాటర్ మన ముఖానికి తాజాదనాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ముఖం మెరుస్తూ ఉండడానికి సహాయపడుతుంది. కనుక ఇటువంటి ప్రకృతిలో లభించే వాటిని ఉపయోగించడం ద్వారా మంచి ఫలితం తో పాటు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు…