హలో ఫ్రెండ్స్ చాలా సాధారణంగా వచ్చే శారీరక సమస్యలు తలనొప్పి కూడా ఒకటి. దీనికి ముఖ్యమైన కారణం నిద్రలేమి కానీ పని ఒత్తిడి స్ట్రెస్ ఎక్కువగా కంప్యూటర్ లో కానీ మొబైల్ గాని చూడడం సరిగ్గా మీరు తీసుకోకపోవడం ఇలా అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఈ వర్షాకాలంలో సైనస్ మూలంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. ఈ తలనొప్పిని మాత్రల తగ్గించుకోవచ్చు కానీ వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కావున ఈ రోజు మీకు ఒక సింపుల్ హోమ్ రెమెడీ తెలియజేస్తున్నాను. మీరు ఈ రెమిడి ఫాలో అయితే చాలు కొన్ని నిమిషాల్లో ని మీ తలనొప్పి మటుమాయం చేసుకోవచ్చు.
ఈ రెమిడీ కి మనకు కావలసిన ముఖ్యమైన పదార్థం మిరియాలు.
- మొదట ఒక ఆరు లేదా ఏడు మిరియాలు తీసుకొని మెత్తని పొడి లాగా చేసుకోండి. ఈ పొడిని ఒక బౌల్ లో తీసుకోండి.
- తర్వాత ఒక అర చెక్క నిమ్మకాయ తీసుకొని నిమ్మరసాన్ని ఇందులోకి కలపండి.
- ఇప్పుడు ఇందులో అరగ్లాసు గోరువెచ్చని నీరు కలపాలి
- అన్నింటిని బాగా మిక్స్ చేయండి.
- తర్వాత ఫిల్టర్ తో నీటిని వడ పోయండి.
- మీకు తలనొప్పి కనిపించిన వెంటనే ఈ నీటిని తాగండి. కొన్ని నిమిషాల్లోనే మీ తలనొప్పి తగ్గుముఖం పడుతుంది.

మిరియాలు : తల నొప్పిని తగ్గించడానికి ఘాటైన వస్తువులు బాగా ఉపయోగపడతాయి అలాంటి వాటిలో మిర్యాలు కూడా ఒకటి. సైనస్ తో వచ్చే తలనొప్పిని తగ్గించడానికి ఈ మిరియాలు చాలా హెల్ప్ చేస్తాయి. మిరియాల ఘాటు మన ముక్కు రంధ్రాలు సక్రమంగా పని చేయడానికి మన రక్తం లో ఆక్సిజన్ లెవెల్ పెరగడానికి కి దోహదపడతాయి.
నిమ్మరసం :మన శరీరంలో తలనొప్పి రావడానికి మనకు ముఖ్యమైన కారణం మన శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం. మన పొట్టలో గ్యాస్ అసిడిటీ ప్రాబ్లం ఉన్న ఈ తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. నిమ్మరసం మన శరీరంలో డీహైడ్రేషన్ ను తగ్గించడమే కాకుండా కడుపులో ఉబ్బరం కూడా తగ్గించి తల నొప్పి నిమిషాల్లో తగ్గిస్తుంది.
మీ ఆహారంలో విటమిన్ సి విటమిన్ డి B12 లోపం వల్ల కూడా తలనొప్పి ఎక్కువగా వస్తుంది కాబట్టి అందుకు తగ్గ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. మాంసకృత్తులు క్యాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. క్యాబేజీ కాలీఫ్లవర్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉన్న మీకు తలనొప్పి రాకుండా ఉంటుంది. యూకలిప్టస్ ఆయిల్ తలనొప్పి నివారణకు బాగా పనిచేస్తుంది. తల నొప్పి ఉన్నప్పుడు ఈ ఆయిల్ తో మసాజ్ చేసుకుంటే మంచి తలనొప్పి నుండి మంచి ఉపశమనం లభిస్తుంది.
చివరిగా తల నొప్పి ఉన్నవారు బాగా నిద్ర పోవాలి ఎందుకంటే కొన్నిసార్లు నిద్ర లేకపోవడం. మీరు నిద్ర సరిగా ఉండేటట్లు చూసుకోవాలి ఖచ్చితంగా రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. దీంతోపాటు వీలైతే ప్రతిరోజు కొద్ది నిమిషాల పాటు ప్రాణాయామం యోగా లాంటివి చేయండి