best simple home remedy for arthritis

కీళ్ల నొప్పులు, నరాల సంబంధ సమస్యతో నడవలేని వారికి కూడా శక్తిని ఇచ్చే అద్భుతమైన చిట్కా

వయసుతో పని లేకుండా ప్రస్తుతం కీళ్ల నొప్పులు వస్తున్నాయి. దీనికి కారణాలు ఎన్ని ఉన్నా ఈ కీళ్ల నొప్పి కూర్చుంటే లేవనివ్వదు, లేస్తే తిరగనివ్వదు, ముఖ్యంగా మోకాళ్ళు చాలా వేదనకు గురవుతుంటాయి. ఇలాంటి అలాగే నరాలకు సంబందించిన సమస్యలు కూడా చుట్టుముడుతుంటాయ్. వీటిని సులువుగా తగ్గించుకోగల అద్భుతమైన ఆయుర్వేద చిట్కా ఒకటుంది. దీన్ని పాటిస్తే సమస్య మూలాల్లోనుండి మాయమైపోతుంది. 

కావలసిన పదార్థాలు

శొంఠి పొడి

వాము

బిర్యానీ ఆకు

బెల్లం.

తయారు చేసుకునే విధానం.

ఒక గిన్నెలో గ్లాసుడు నీటిని వేసి అందులో స్పూన్ శొంఠి పొడి వేసి మరిగించాలి, ఇది మరుగుతున్నపుడు ఒక స్పూన్ వాము, మరియు ఒక బిర్యానీ ఆకు వేసి బాగా మరిగించాలి. తరువాత దీన్ని గ్లాసులోకి వడగట్టుకుని ఇందులో ఒక స్పూన్ బెల్లం జోడించి బాగా కలిపి తరువాత తాగాలి.

◆శొంఠి గొప్ప ఇమ్యూనిటీ సిస్టంగా పనిచేస్తుంది. కఫాన్ని తగ్గించడంలోనూ, వాతాన్ని అదుపు చేయడంలో ఇది పనిచేస్తుంది అలాగే తిన్న ఆహారం జీర్ణమవడానికి దోహాధం చేస్తుంది.

◆ఇందులో ఉపయోగించిన వాము జీర్ణాశయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. పేగుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది, ఇందులో ఫైబర్ అల్సర్ పుండ్లను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆహారం ద్వారా ఉత్పన్నమయ్యే వాతాన్ని అరికడుతుంది 

◆బిర్యానీ ఆకు రక్త వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో పేరుకుపోయిన మలినాలను శుద్ధి చేసి రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తుంది.

◆బెల్లంలో ఐరన్ శరీరానికి కావలసిన రక్తాన్ని వృద్ధి చేయడంలో దోహదపడుతుంది.

పైన చెప్పుకున్న నాలుగింటి కలయిక వల్ల తయారుచేసుకున్న పానీయం  చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

◆దీన్ని ప్రతిరోజు నియమానుసారంగా  తీసుకుంటూ ఉంటే నరాలకు బలం చేకూరుతుంది మరియు కీళ్ల మధ్య రాపిడి తగ్గి నొప్పులు కూడా తగ్గుతాయి. 

◆వాతం సమస్యతో ఎదురయ్యే కీళ్ల నొప్పులకు ఈ పానీయం బాగా పనిచేస్తుంది. 

◆దీన్ని వాడుతూ ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారిలో కీళ్ల సమస్య తొందరగా వస్తుంది కాబట్టి బరువుబతగ్గడం పై దృష్టి పెట్టాలి.

◆కీళ్ల నొప్పులు ఉన్నవారు ఏకధాటిగా అధిక దూరం నడవకూడదు. బరువులు ఎత్తడం కీళ్ల ఎముకల మీద ఒత్తిడి పడే వ్యాయామాలు, పనులు చేయడం వంటివి చేయకూడదు.

◆వాతాన్ని కలిగించే ఆహారపదార్థాలు తీసుకోవడం మానివేయాలి. దుంప కూరలకు దూరంగా ఉండాలి.

◆ఒకే భంగిమలో ఎక్కువసేపు కోర్చోకూడదు, దీనివల్ల కీళ్ల ఎముకల మీద ప్రభావం పడకుండా ఉంటుంది.

చివరగా…….

కీళ్ల నొప్పులు, నరాల సంబంధ సమస్యల నివారణకు పైన చెప్పుకున్న పానీయం మాత్రమే కాకుండా జీవనశైలి ని కూడా చక్కగా మలచుకుంటే  సమస్య తొందరగా తగ్గిపోతుంది.

Leave a Comment

error: Content is protected !!