Best Skin Whitening treatment In Hyderabad

నల్లగా ఉండే చర్మాన్ని తెల్లగా మెరిసిపోయే లాగా చేసే అద్భుతమైన చిట్కా

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తెల్లగా  ఉండరు. కొంతమంది తెల్లగా ఉంటే కొంతమంది చామనచాయగా ఉంటారు. కొంతమంది మరి నల్లగా ఉంటారు. కొంతమంది రంగు తక్కువగా ఉన్నవారు బాధపడుతూ తెల్లగా అవ్వడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పార్లర్కు వెళ్లి రకరకాల  ఫేషియల్స్ అని,  ట్రీట్మెంట్స్  అని తీసుకుంటారు. అయినప్పటికీ రంగు మారడం ఉండదు. ఇలాంటి వారు ఒకసారి ఈ చిట్కాను ట్రై చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ముప్పావు గ్లాసు నీళ్లు వేసుకోవాలి. 

         తర్వాత దీనిలో రెండు చెంచాల బియ్యం పిండి వేసుకోవాలి.  బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. బియ్యం పిండి వద్దు అనుకున్న వాళ్లు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. బియ్యప్పిండి చర్మాన్ని తెల్లగా మెరిసిపోయేటట్లు చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.   జపనీస్ తెల్లగా ఉండడం కోసం   బియ్యం పిండిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. బియ్యప్పిండి  చర్మ ఛాయను మెరుగు పరచడంలో చాలా బాగా సహాయపడుతుంది. తర్వాత దీనిలో మీరు ప్రతి రోజూ ఉపయోగించే సబ్బును  గ్రేటర్ సహాయం తురుముకొని బియ్యం పిండి కలిపిన నీటిలో వేసి బాగా కలుపుకోవాలి. 

        సబ్ కరిగే వరకు కలిపిన తర్వాత స్టౌ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ  మిశ్రమం దగ్గరపడే వరకూ కలుపుతూ ఉండనివ్వాలి. క్రీమ్ కంటెస్టెన్సీ  వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.   చల్లారిన తర్వాత ఏదైనా  ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఒకేసారి పది రోజులు సరిపడినంత తయారు చేసుకొని ఉంచుకోవచ్చు. ఇది నెలరోజుల వరకు నిల్వ ఉంటుంది.  తర్వాత దీనిలో విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసి బాగా కలుపుకోవాలి. విటమిన్ ఈ  ఆయిల్ చర్మాన్ని తెల్లగా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.

       ఈ మిశ్రమాన్ని స్నానం చేయడానికి ముందు సోప్ అప్లై చేసుకున్నట్లు అప్లై చేసుకొని రెండు మూడు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మీ చర్మం తెల్లగా మెరిసిపోతుంది.  జపనీస్ తెల్లగా ఉన్నప్పటికీ బియ్యం పిండిని ఎక్కువగా చర్మ సంరక్షణలో ఉపయోగిస్తారు. ఈ రెండు ఇంగ్రీడెంట్స్ తో  ఈ క్రీమ్ తయారు చేసుకుని ఉపయోగించినట్లయితే మీ చర్మం రంగు మెరుగుపడుతుంది. తెల్లగా అవ్వాలి అనుకునేవారు ఈ చిట్కాను ట్రై చేయండి. మంచి ఫలితం ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!