గుడ్ బ్యాక్టీరియా అనేవి మన శరీరానికి చాలా ఎక్కువ మేలు చేస్తున్నాయి. అవి లాక్టోబసిల్లస్, ఈ కొలై, సాల్మనెల్ల, స్టెఫీలో కోకస్, బిఫిడో బ్యాక్టీరియా, ఎసిడో ఫిల్లస్ లాంటి ముఖ్యమైన హెల్ప్ ఫుల్ బ్యాక్టీరియాలో ఉంటాయి. ఇవన్నీ ముఖ్యంగా మన శరీరానికి గాని మన ఆరోగ్యానికి గాని చాలా హెల్ప్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ హెల్ప్ ఫుల్ బ్యాక్టీరియా అనేది ప్రేగుల్లో రక్షణ వ్యవస్థని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రేగులలో విటమిన్ D, విటమిన్ K తయారవడానికి ఈ బ్యాక్టీరియాలో బాగా హెల్ప్ చేస్తాయి. ఆటో ఎమినో డిజార్డర్స్ రాకుండా రక్షణ వ్యవస్థ హైపర్ కాకుండా ఈ బ్యాక్టీరియాలు ఉపయోగపడుతున్నాయి.
మన శరీరంలో మినరల్ లాస్ ను అరికట్టడానికి ఈ బ్యాక్టీరియాలో ఉపయోగపడుతున్నాయి. మన శరీరంలో క్యాన్సర్ నివారించడానికి కూడా ఈ గుడ్ బ్యాక్టీరియాలో హెల్ప్ చేస్తున్నాయి. మన పొట్ట ప్రేగుల్లో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ ని హెల్తీగా ఉండేటట్టు ఇవి కాపలా కాస్తాయి. ఈ హెల్ప్ ఫుల్ బ్యాక్టీరియా వల్ల మన ప్రేగులలో ఉపయోగపడే సెరటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ ని బాగా పెంచుతున్నాయి. మతిమరుపు రాకుండా బ్రెయిన్ సెల్స్ కుచిన్చుకుపోకుండా రక్షించుకోవడానికి కూడా ఇది పనికొస్తుంది. గర్ల్స్ స్టోన్స్ రాకుండా రక్షిస్తుంది. గుడ్ బ్యాక్టీరియా మేక్రో ఫేస్ కణాలని, టీ హెల్పర్ సెల్స్ నీ యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది.
మనం చేసే పది రకాల తప్పులు వల్ల ఈ గుడ్ బ్యాక్టీరియా సంఖ్య తగ్గిపోతుంది. మంచినీళ్లు తక్కువ తాగడం, తరచూ తింటూ ఉండడం వల్ల కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అయ్యి బ్యాక్టీరియా పెరగడానికి గ్యాప్ అనేది ఉండదు. ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కూడా ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుంది. దీనితోపాటు ఎస్టి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ బ్యాక్టీరియా అనేది నశిస్తుంది. వ్యాయామాలు చేయనందు వల్ల కూడా ఇవి తగ్గిపోతూ ఉంటాయి. పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల, నిద్రలేమి వల్ల ఇవి తగ్గిపోతాయి. స్ట్రెస్ వల్ల కూడా ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుంది.
మాగిన పండ్లలో ఈ బ్యాక్టీరియా అనేది బాగా పెరుగుతుంది. చిన్నపిల్లల్లో ఈ బ్యాక్టీరియా అనేది తల్లిపాల ద్వారా చేరుతుంది. కాబట్టి ఈ పాలల్లో గుడ్ బ్యాక్టీరియా చాలా అధికంగా ఉంటుంది.