మన ఊపిరి తీసుకున్నప్పుడు గాలి గాలి గొట్టాల ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడ శుభ్రపడుతుంది. కఫం చేరినప్పుడు ఊపిరితిత్తులు గాలిని తీసుకోలేక కెపాసిటీ ఎలా తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం గాలి గొట్టాల ద్వారా గాలి పీల్చినప్పుడు గాలి గొట్టాలు, ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి. గాలి బయటకు వదిలినప్పుడు ఊపిరితిత్తులు సంకోచిస్తాయి.
ఇలా మనం గాలి పీల్చినప్పుడు, వదిలినప్పుడు గాలి తిత్తులు ఎలా వ్యాకోచిస్తాయి దాన్నిబట్టి ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీని వివరిస్తారు.కఫం చేరితే గాలి చేరడానికి చోటు లేక ఊపిరి తీసుకోవడంలో సమతుల్యత దెబ్బతింటుంది. దీనివలన అనేక శ్వాససంబంధ సమస్యలు కూడా వస్తాయి. కఫం, శ్లేష్మాలు లేకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను ఇప్పుడు పాటిద్దాం.
ఉదయాన్నే ఒక గ్లాసు వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం వలన కఫం కరిగిపోతుంది. లేదంటే వేడి నీటి ఆవిరి ప్రతిరోజు పట్టాలి. ఆవిరి కోసం నీటిలో పసుపు, యూకలిప్టస్ ఆయిల్ లాంటివి వేసుకోవచ్చు. ఇవి శ్లేష్మం కరిగించాలంటే ఊపిరితిత్తులకు చేరేలా లోపలి వరకూ గాలి పీల్చుకోవాలి. ఇలా చేయడం వలన కఫం కరిగిపోయి ఊపిరితిత్తులు విశాలంగా అవుతాయి.
అలాగే రోజు వేపపుల్ల నమిలి ఆ రసాన్ని మింగటం వలన కఫం కరిగిపోతుంది. దగ్గినపుడు శ్లేష్మం బయటకు వస్తే ఊపిరితిత్తులు త్వరగా కోలుకుంటాయి. పడుకునేటప్పుడు కాళ్ల దగ్గర ఎత్తు పెట్టుకొని పడుకోవడం వలన ఛాతి నుండి గాలి గొట్టాల ద్వారా కఫం గొంతు దగ్గరికి చేరుతుంది. ఇలా బయటకు పోవడం వలన ఊపిరితిత్తులు త్వరగా శుభ్రపడతాయి.
ఉదయం నుండి నిరాహారంగా 9 గంటలకు ఒక సారి వేడి నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి. తర్వాత 11 గంటలకు ఒకసారి నిమ్మరసం, తేనె, మిరియాలపొడి కలిపి తాగడం వలన కఫం కరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మిరియాల పొడిని నీటిలో వేసి మరిగించాలి.
అది గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె, నిమ్మరసం కలిపి తాగడం వలన గొంతు నొప్పి, ఊపిరితిత్తుల్లో చేరిన కఫాన్ని తగ్గిస్తుంది. ఇలా కనీసం వారం రోజులు తాగడం వలన ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ పెరుగుతుంది. దీనితోపాటు ప్రతిరోజు ఊపిరితిత్తులకు సంబంధించిన ఎక్సర్సైజులు చేయడం వలన ఊపిరితిత్తుల్లో పనితీరు మెరుగుపడుతుంది.